"కళ" కోసం కలను చంపుకున్న ఎస్పీ బాలు...

VAMSI
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఒక గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా పరిశ్రమకు తన సేవలను అందించాడు. ఆయన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని ఈ రోజు స్మరించుకుందాము. 1946 జూన్ 4 న నెల్లూరు జిల్లాలో జన్మించారు బాలు. కుటుంబం అంతా సంగీతంలో ప్రావీణ్యులు కావడం చేత బాలు కి సంగీతంపై అసక్తి కలిగింది. కేవలం ఐదేళ్ల ప్రాయంలోనే తన తండ్రితో కలిసి భక్త రామదాసు నాటకంలో నటించారు. తన స్కూల్ విద్యను శ్రీకాళహస్తిలో పూర్తి చేశాడు. ఇంటర్ ను తిరుపతిలో పూర్తి గావించాడు. అయితే చదువుతూనే తనలోనే సంగీత కళాకారుడికి ఆయివు పోతూనే వస్తున్నాడు. ఎక్కడ అవకాశం దొరికినా పాటలు పాడుతూ తన లోని సింగర్ ను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తిరుపతిలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో బాలు మనసులో ఒక కోరిక కలిగింది. 

ఎలాగైనా ఇంటర్ తర్వాత  ఇంజనీరింగ్ చేయాలి, ఒక మంచి ప్రభుత్వ ఇంజనీర్ గా స్థిరపడాలని ఎన్నో కలలు కన్నాడు. తన తండ్రి సాంబమూర్తి సైతం కొడుకు ఇంజనీర్ అయితే చూడాలని కాలాలు కన్నాడు.  అందులో భాగంగానే ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లో అనంతపురం కాలేజ్ లో సీటు వచ్చింది. బాలు ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్లి, ఎందుకో మనసు మార్చుకుని తిరిగి వచ్చేశాడు. అయితే ఆ తర్వాత మద్రాస్ లోని ఇంజనీరింగ్ కు సమానమైన ఎ ఎమ్ ఐ ఇ కోర్స్ లో చేరారు.  అప్పటికే సంగీతంలో తను బాగా మునిగిపోయి ఉన్నాడు. బహుశా ఈ లోకానికి తన సంగీత సామర్థ్యాన్ని తెలియచేయడం కోసం ఇంజనీరింగ్ ను వదిలేశాడు అని అంతా అంటుంటారు. ఇందులో నిజముందో లేదో తెలియకపోయినా తన సంగీత కళ కోసం తన కలను వదులుకున్నాడు ఎస్పీ బాలు.

ఇంజనీర్ అయి ఉంటే ఇంతటి గుర్తింపు మంచి పేరు వచ్చి ఉండేది కాదేమో. అంతలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను తన పాటలతో అలరించారు. ఇతని పాటకు మైమరచిపోని ప్రేక్షకుడు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనారోగుతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25 2020 వ తేదీన మన అందరినీ వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: