100 మంది రేపిస్టులతో లేడీ జ‌ర్న‌లిస్ట్‌ ఇంట‌ర్వ్యూ.. వెలుగులోకి షాకింగ్ విష‌యాలు!

Paloji Vinay
   రేపిస్టు అనే మాట వింటే భ‌యంక‌ల‌గ‌క మాన‌దు. చిన్న‌పాటి నేరం చేసి జైలుకు వెళ్లిన వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే భ‌య‌మేస్తుంది. కానీ ఆ క‌రుడు గ‌ట్టిన రేపిస్టుల‌ను ఇంట‌ర్వ్యూ చేసింది ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్‌.. ఒక‌ర‌కు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 100 మ‌గ‌పుటేనుగుల‌ను తీహార్ జైల‌కు వెళ్లి మ‌రి వారి ఇంట‌ర్వూ తీసుకుంది మ‌ధుమిత పాండే అనే లేడి జ‌ర్న‌లిస్ట్‌. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారి జీవిత గమనాన్ని అధ్యాయనం చేసి రీసెర్చ్‌ థీసిస్‌ డెవలప్‌ చేశారు ఆమె. యూకేలోని అంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందిన మధుమిత పాండే ఢిల్లీలో పుట్టి పెరిగారు.  దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘నిర్భయ రేప్‌’ ఘటనపై భారతీయుల్లో వచ్చిన స్పందన త‌న‌లో ఆస‌క్తిని పెంచింది.

     నిర్భయ చట్టం తీసుకువ‌చ్చిన అనంత‌రం కూడా అత్యాచార సంఘటనలు ఆగలేదు. దీంతో క‌ఠిన చ‌ట్టాలు అమల్లోకి వచ్చినా భార‌త్‌లో అత్యాచార ఘటనలు తగ్గకపోవడంపై పరిశోధన చేయాలని మ‌ధుమిత పాండే నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే ఢిల్లీలో తన పరిశోధనను ప్రారంభించారు ఆమె. రేప్‌ కేసులో నిందితుల‌ను భారత్‌లో ఎలా చూస్తారు? అనే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తూ.. ప్ర‌త్యేక‌మైన అనుమ‌తులు తీసుకుని తీహార్‌ జైల్లోని అత్యాచార దోషులను ఇంటర్వ్యూ చేయడం మొద‌లు పెట్టారు. అలా 100 మంది రేపిస్టుల‌ను కొన్ని వారాల పాటు ఇంట‌ర్వ్యూ చేశారు ఆమె.

   ఈ ఇంట‌ర్వ్యూలో కీల‌క విష‌యాలు తెలుసుకున్నారు, మ‌రెన్నో అంశాల‌ను గుర్తించారు మ‌ధుమిత పాండే. ఇందులో జైలుకు వెళ్లిన వారిలో అంద‌రూ నిర‌క్ష‌రాస్యూలేన‌ని తెలుసుకున్నారు. కానీ ఈ ఇంటర్వ్యూల తర్వాత భారతీయ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న అత్యాచార నిందుతుల‌పై  తన అభిప్రాయం మారిందని ఆమె వెల్ల‌డించింది. రేపిస్టుల్ని భయానక వ్యక్తులుగా చూడటం సరికాదని…వారికొచ్చిన ఆలోచనలను అదుపు చేసుకోలేక, ఆలోచ‌న విధానంలో మార్పు లేక‌పోవ‌డం వ‌ల్లే అత్యాచారాల వంటి దారుణాల‌కు పాల్ప‌డ్డ‌ట్టు త‌న‌కు తెలిసింద‌న వివ‌రించారు.

    తాను ఇంటర్వ్యూ చేసిన వారిలో కొంద‌రికి అసలు ‘రేప్‌’ అనే పదానికి అర్థం ఏంటో తెలియదని చెప్పారు. భారత్ లోని పాఠ‌శాలల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ లేకపోవడం కూడా లైంగిక‌దాడులు జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మ‌ని.. `సెక్స్‌ ఎడ్యుకేషన్‌’ సబ్జెక్టును సిలబస్‌లో చేరిస్తే అది లైంగిక‌దాడుల‌ను నియంత్రించ‌డానికి అవ‌కాశం ఉటుంద‌ని అభిప్రాయపడ్డారు మ‌ధుమిత‌. ప్రతి విషయాన్ని రహస్యంగానే ఉంచడం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటున్నాయని ఈ కారణాలతోనే మగపిల్లలకు లైంగిక విజ్ఞానం ఎలా అందుతుందని మ‌ధుమిత పాండే ప్రశ్నించారు.

 నిందుతుల్లో ముగ్గురు, న‌లుగురు మాత్ర‌మే వారు చేసిన ప‌నికి ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశార‌ని, బాధితురాలిని కూడా త‌ప్పుప‌ట్టిన వారు కూడా వాళ్లలో ఉన్నార‌ని తెలిపారు మ‌ధుమిత పాండే. అలా 100 మందిని ఇంట‌ర్వ్యూ చేయ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు తెలిసాయ‌ని దీంతో రేపిస్టుల ప‌ట్ల త‌న అభిప్రాయం మారింద‌ని వెల్ల‌డించారు ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: