సెక్స్ మ‌ధ్యలో కండోమ్ తీస్తే కేసు.. కొత్త చ‌ట్టం ఎక్క‌డంటే.?

Paloji Vinay
శృంగారంలో పాల్గోనే స‌మ‌యంలో సేఫ్టి కోసం చాలా మంది కండోమ్స్ వాడుతుంటారు. అలా వాడే స‌మ‌యంలో కండోమ్‌ను మ‌ధ్య‌లో తీసేస్తే నేర‌మ‌ట దీనికి సంబందించి కొత్త‌ చ‌ట్టాన్ని అమెరికా తీసుకురానుంది. అగ్ర‌రాజ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఉంటుంది. ఈ రాష్ట్రాల‌కు స‌ప‌రేట్ చ‌ట్టాలు ఉంటాయి. రాష్ట్రానికి రాష్ట్రానికి నిబంధ‌న‌ల్లో తేడాలు ఉంటాయి. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తే అక్క‌డి స్థానిక చ‌ట్టాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. ఇలా ఓ రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర బిల్లు ప్ర‌వేశ‌పెట్టింది అక్క‌డి ప్ర‌భుత్వం.

దిని ప్ర‌కారం.. శృంగారం చేసే స‌మ‌యంలో భాగ‌స్వామి ప‌ర్మిష‌న్ లేకుండా కండోమ్ తీయ‌కూడ‌దు. ఒక‌వేళ తొల‌గిస్తే ఇక‌ముందు నేరంగా ప‌రిగ‌ణించ‌బడుతుంది. దీంతో పాటు శిక్ష కూడా ప‌డుతుంది. దీనికి సంబంధించి ఏబీ 453 పేరుతో కొత్త చట్టం ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించారు. తాజాగా ఈ బిల్లుకు సంబంధించిన విష‌యాల‌ను కాలిఫోర్నియాలోని అసెంబ్లీ సభ్యురాలు క్రిస్టినా గార్సియా తెర పైకి తీసుకొచ్చారు. ఈ మధ్యనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ.

అయితే.. ఈ బిల్లుపై  గవర్నర్ సంతకం చేస్తే చ‌ట్టంగా మారుతుంది. బిల్లుపై గ‌వ‌ర్న‌ర్ సంత‌కం చేస్తే ఈ తరహా సంచలన బిల్లును తీసుకొచ్చిన మొట్ట‌మొద‌టి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిల‌వ‌నుంది. ఈ విష‌య‌మై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  కాలిఫోర్నియా సివిల్ కోడ్ సెక్షన్ 1708.5ను సవరిస్తూ 453 బిల్లును తీసుకొచ్చింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఈ 1708.5 సెక్ష‌న్ ప్ర‌కారం శృంగారం చేసే స‌మ‌యంలో ఏ విధంగానైనా భాగ‌స్వామిని గాయ‌ప‌ర్చ‌కూడ‌దు.. ఒక వేళ అలా చేస్తే అది నేరంగా ప‌రిగ‌ణిస్తారు. దీనికి కొన‌సాగింపుగా  453 బిల్లును తీసుకువ‌స్తున్నారు.  దీని ప్ర‌కారం సెక్స్ చేసే స‌మ‌యంలో భాగ‌స్వామి అనుమ‌తి లేకుండా కండోమ్ తొల‌గించ‌డానికి లేదు.. ఒక వేళ అలా చేస్తే నేరం మోప‌డ‌మే కాకుండా శిక్ష విధిస్తార‌ట‌. గ‌వ‌ర్న‌ర్ సంత‌కంతో ఈ బిల్లు చ‌ట్టంగా మార‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: