హ‌ర్ర‌ర్ ఆఫ‌ర్ : ఆ సినిమాలు చూస్తే పైస‌లిస్త‌ర‌ట‌..!

Paloji Vinay
 ఎవ‌రైనా ప‌ని చేస్తేనో.. ఉద్యోగం చేస్తేనే డ‌బ్బులు ఇస్తారు. ఇందేంటి మ‌రి సినిమాలు చూస్తే డ‌బ్బులు ఎలా ఇస్తార‌నే అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. అయితే, మీరు మ‌యూరి (మాయ‌) సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. అందులో త‌మ హ‌ర్ర‌ర్‌ సినిమా చూస్తే డ‌బ్బులు ఇస్తామ‌ని ఓ సినిమా ప్ర‌చారం చేస్తుంది. ఇందుకు న‌య‌న‌తార డ‌బ్బుల కోసం ఆ సినిమా చూసేందుకు ఒప్పుకుంటుంది. సినిమా చూసే స‌మ‌యంలో ఆమె హ‌ర్ట్ బీట్‌, బీపీ చెక్ చేస్తు ఉంటారు. అలాంటి సంఘ‌ట‌నే అమెరికాలో వ‌చ్చింది. హ‌ర్ర‌ర్ సినిమా చూస్తే ల‌క్ష రూపాల‌య‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది కూడా.

హర్రర్‌ సినిమాలు చూడ‌డానికి క‌ష్ట‌మైన ఇష్టపడే వాళ్లు ఎంతమంది ఉంటారు. దానిని చూడడానికి భ‌య‌ప‌డే వారు కూడా ఉంటారు. కానీ, అమెరికాలో ఓ కంపెనీ..  హర్రర్‌ సినిమాల్ని చూసేవాళ్లకు ప్రైజ్ మ‌నీ ఇస్తామ‌ని ప్ర‌క‌టిచింది. అమెరికాలోని ఫైనాన్స్‌బజ్‌ అనే ఫైనాన్స్‌ కంపెనీ ఈ నొటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది. అక్టోబర్‌ నెలలో వాళ్లు ఎంపిక చేసిన పదమూడు హాలీవుడ్‌ హర్రర్‌ సినిమాల్ని పదిరోజుల్లో చూడాలి.. అది కూడా క‌ను రెప్ప వాల్చ‌కుండా. అలాగే భ‌య‌ప‌డ‌కూడ‌దు కూడా. ఈ  చాలెంజ్‌లో గెలిస్తే 1,300 డాలర్లకి పైగా(దాదాపు లక్ష రూపాయల‌) ప్రైజ్‌మనీ అంద‌జేస్తారు.  అయితే 18 సంవ‌త్స‌రాల‌ పైబడిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే కండిషన్ పెట్టింది ఆ ఫైనాన్స్ కంపెనీ.
 


    త్వరలో హాలీవుడ్‌లో కొన్ని హర్రర్‌ సినిమాలు విడుదల అవ‌నున్నాయి.  ఈ నేప‌థ్యంలో హైబడ్జెట్‌.. లోబడ్జెట్‌ హర్రర్‌ సినిమాల్లో ఏవి ఎక్కువగా భయపెడతాయి అనేది తెలుసుకునేందుకు ఫైనాన్స్‌బజ్‌ ఈ ప్రయత్నానికి పూనుకుంది. ఎంపిక‌యిన వారు చూడాల్సిన జాబితాలో ‘సా, ఎమిటీవిల్లే హర్రర్‌, ఏ క్వైట్‌ ప్లేస్‌, ఏ క్వైట్‌ ప్లేస్‌-2, క్యాండీమ్యాన్‌, ఇన్‌సైడియస్‌, ది బ్లెయిర్‌ విచ్‌ ప్రాజెక్ట్‌, సిన్‌స్టర్‌, గెట్‌ అవుట్‌, ది పర్గే, హలోవీన్‌(2018), పారానార్మల్‌ యాక్టివిటీ, అన్నాబెల్లె’ లాంటి హ‌ర్ర‌ర్ చిత్రాలు ఉన్నాయి.


  అలాగే ఒంటరిగా ఈ చిత్రాలు చూస్తున్నంత సేపు ఫిట్‌బిట్‌ సాయంతో హార్ట్‌, పల్స్‌ రేట్‌ను మానిటర్‌ చేయడానికి ఫిట్‌బిట్‌ను ఆ కంపెనీ అందిస్తోంది.  సినిమా చూసే స‌మ‌యంలో ఏమైనా తేడాలు క‌నిపిస్తే .. ఆ వ్యక్తిని మూవీ చూడడం ఆపేయమని డిస్‌క్వాలిఫై చేసేస్తార‌ట‌. అంతేకాదు సినిమాలు చూడడానికి 50 డాలర్ల రెంటల్‌ డబ్బును కూడా పే చేస్తామ‌న్నారు.  ఈ ఉద్యోగానికి ‘హర్రర్‌ మూవీ హార్ట్‌ రేట్‌ అనలిస్ట్‌’ అనే పేరును పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: