హెరాల్డ్ సెటైర్:బండి గారూ... ముందు దీని మీద దృష్టి పెట్టండి...?

Gullapally Venkatesh
తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిలబడాలి అంటే కచ్చితంగా అన్ని జిల్లాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే నియోజకవర్గాల ఇన్చార్జిలు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పులు చేస్తున్నారు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సమస్యల తీవ్రత ఎక్కువగానే ఉంది. అయినా సరే బండి సంజయ్ వాటిని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. ఇక పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షుడు ఎవరో కూడా చాలా జిల్లాల్లో స్పష్టత రావడం లేదు.
ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ఎవరు ఏంటి అనేది కార్యకర్తలు కూడా దాదాపుగా తెలియదు. మీడియాలో కూడా పెద్దగా మాట్లాడక పోవడం తో వాళ్లకు అసలు పార్టీలో ప్రాధాన్యత ఉందా లేదా అనే దానిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ కొంతమందిని కావాలని ముందుకు నడిపిస్తారని కొంతమంది కావాలనే పక్కన పెడుతున్నారని భారతీయ జనతా పార్టీలు కూడా భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి.
ఇది ఎంత వరకు కూడా బీజేపీకి మంచిది కాదు. టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కొన్ని కొన్ని అంశాలను చాలా శ్రద్ధగా తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా సమర్థవంతమైన నాయకుడిని ఇన్చార్జిగా ప్రకటించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు బీజేపీ లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అన్ని అంశాలపై శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా పార్టీలో ఉన్న నేతల మధ్య విభేదాలు కూడా ఎక్కువగా ఉండటంతో బండి సంజయ్ వాళ్ల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: