సెటైర్ : ముందే కూసేస్తున్న జనసేన కోయిల ?

ఏంటో నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే .. అంటూ ఓ సినిమాలోని డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యిందో. ఆ విధంగానే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అన్ని రాజకీయ విషయాలు ముందుగానే తెలిసి పోతున్నాయి. అసలు దేశవ్యాప్తంగా ఏఏ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో పవన్ ముందుగానే గ్రహించేస్తున్నారు. కొమ్ములు తిరిగిన రాజకీయ ఉద్దండులు సైతం కనిపెట్టలేని ఎన్నో విషయాలను పవన్ కనిపెడుతూ, ఇప్పుడు బహిరంగంగా వాటిని పవన్ జనాలకు చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 



అసలే జనసేన పార్టీ పరిస్థితి ఏపీలోనూ , తెలంగాణలో ను అంతంతమాత్రంగా ఉన్న సమయంలో రెండు పడవల మీద కాలు వేసినట్లుగా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని తహతహలాడుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో బిజెపి, జనసేన లు విడివిడిగా పోటీ చేసేందుకు చూస్తూ గందరగోళంలోకి నెడుతున్నారు.ఇదిలా ఉండగానే చాలా కాలం తర్వాత ఏపీలో అడుగు పెట్టిన పవన్ జమిలి ఎన్నికలు అంటూ హడావుడి చేయడం , గతంలో చంద్రబాబు అదిగో జమిలి ఇదిగో జమిలి అంటూ ఏవిధంగా హడావిడి చేశారో,  ఇప్పుడు ఆ విధంగానే హడావుడి చేసేందుకు సిద్ధమవుతుండడం వంటి ఎన్నో పరిణామాలు ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. 



అసలు 2022లో ని జమిలి ఎన్నికలు రాబోతున్నాయని తనకు ఖచ్చితమైన సమాచారం ఉంది అంటూ పవన్ నొక్కి చెబుతూ, అందర్నీ కంగారు పెట్టేస్తున్నారు. అంటే కేంద్ర బిజెపి పెద్దలు తనకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అనే విషయాన్ని ఈ విధంగా చెప్పుకునేందుకు  పవన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అయితే పవన్ జమిలి పై ఇప్పుడు కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి చంద్రబాబు చెబుతున్న పాత మాటలన్నీ సరికొత్తగా చెబుతూ, తనకే ఈ సీక్రెట్ తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తుండడం హాస్యాస్పదంగా ఉంది అనే కామెంట్స్ వస్తున్నా, పవన్ ఏ మాత్రం లెక్క చేసే విధంగా కనిపించడం లేదు. ఇప్పుడు ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్న తరుణంలో, ఏదో ఒక హడావిడి చేయాలనే తాపత్రయంతో పవన్ ఈ విధంగా హడావుడి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: