హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును పట్టుకుని అంత మాటనేశాడేంటి ?

Vijaya
చంద్రబాబునాయుడు గురించి బీజేపీ అధ్యక్షుడు మరీ దారుణంగా కామెంట్ చేశారు. మీడియాతో వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబును బురదపాముతో పోల్చారు. తనను తాను చంద్రబాబు తాచుపాముతో పోల్చుకుంటాడేమో కానీ ఆయన కేవలం ఓ బురద పాము మాత్రమే అని బల్గగుద్ది మరీ చెప్పారు.  అవసరాని తగ్గుట్లుగా ఎప్పటికప్పుడు మాట మార్చటం, అవసరానికి ఎవరి కాళ్ళైనా పట్టుకునే నైజం ఉన్న వ్యక్తి బురదపాము కాకుండా తాచుపాము ఎలాగవుతాడంటూ గట్టి లా పాయింటే సంధించారు. గతంలో ఓసారి బీజేపీతో పొత్తు వద్దని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించేశారట. చంద్రబాబు ప్రకటనను తాము కూడా సవాలుగా తీసుకున్నామని వీర్రాజు చెప్పారు. అందుకనే అన్నీ అసెంబ్లీ, ఎంపి ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ డిసైడ్ చేసిందట. విజయవాడ పార్లమెంటు సీటులో దగ్గుబాటి పురందేశ్వరిని పోటిలోకి దింపాలని అప్పట్లో డిసైడ్ అయ్యిందన్నారు.



పోటీ విషయంలో తమ నిర్ణయాన్ని తెలియగానే సాయంత్రం వచ్చి పార్టీ నేతల కాళ్ళను చంద్రబాబు గట్టిగా పట్టేసుకున్నాడట. తాము వద్దంటున్నా వినకుండా ఒత్తిడి తెచ్చి మరీ పొత్తు పెట్టుకున్నాడని చెప్పిన వీర్రాజు అందుకనే చంద్రబాబును తాను తాచుపాము కాదు కేవలం బురదపామంటున్నది అంటూ గాలి తీసేశారు. తనకు అవసరం అనుకున్నపుడు అవసరమైన వాళ్ళని బాగా వాడుకుని తర్వాత అవసరం తీరిపోయిందనుకోగానే దూరంగా పెట్టేయటం చంద్రబాబు నైజం అంటూ ఎద్దేవా చేశారు.  రాజీనామా చేసిన టీడీపీ సీనియర్ నేత గద్దె బాబూరావు వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన వీర్రాజు చంద్రబాబుపై బాగా రెచ్చిపోయారు. మామూలుగానే టీడీపీపైనా చంద్రబాబుపైనా ఆరోపణలు, విమర్శలు చేయాలంటే వీర్రాజు ఏ రేంజిలో రెచ్చిపోతారో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఏదైనా అవకాశం దొరికితే ఇక వదులుకుంటారా ?



గద్దె బాబురావూ పార్టీలో చేరిన అంశాన్ని ఉపయోగించుకుని ఓ రేంజిలో చెలరేగిపోయారు అధ్యక్షుడు. చంద్రబాబుపై తన మనసులో పేరుకుపోయిన కసినంతా వీర్రాజు సాంతం తీర్చేసుకున్నారనే అనుమానంగా ఉంది. కార్యకర్తలతో మాట్లాడుతూ ఎన్టీయార్ నే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా దింపేశాడంటు చంద్రబాబుపై రెచ్చిపోయారు.  ఎన్టీయార్ ను ఎవరు అవమానించని రీతిలో చంద్రబాబే అవమానించారంటూ తీవ్రంగా ఆరోపించారు.  టీడీపీ కార్యకర్తలు ఏ పార్టీలో ఉండాలో ఇప్పటికైనా నిర్ణయించుకోవాలంటూ పిలుపునివ్వటమే విచిత్రంగా ఉంది.  పనిలోపనిగా కొత్తగా అధ్యక్షునిగా అపాయింట్ అయిన కింజరాపు అచ్చెన్నాయుడు గురించి కూడా వీర్రాజు రెచ్చిపోయాడు. రాష్ట్రపార్టీకి అచ్చెన్నాయుడు అధ్యక్షునిగా కనిపించటం లేదన్నారు. కేవలం చంద్రబాబు, లోకేష్ కుటుంబాలకు మాత్రమే అచ్చెన్న అధ్యక్షుడిగా నియమితుడైనట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు.



మొత్తానికి ఒకవైపు చంద్రబాబును మరోవైపు అచ్చెన్నాయుడును వీర్రాజు గట్టిగానే అంటుకున్నారు. కాకపోతే తమ పార్టీ గురించే చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమ పార్టీ బలపడుతోందట. వైసీపీకి తామే అసలైన ప్రత్యామ్నాయమని చెప్పుకోవటమే బాగా ఓవర్ గా అనిపిస్తోంది. నిజానికి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట స్ధానాల్లో గట్టి అభ్యర్ధులను పోటిలోకి దింపేంత సీన్ కూడా బీజేపీకి లేదని అందరికీ తెలిసిందే. ఏదో కేంద్రంలో అధికారంలో ఉంది కదాని మాత్రమే ఏపిలో కమలంపార్టీకి అందరు మర్యాదిస్తున్నారు. లేకపోతే బీజేపీని ఎవరూ రాష్ట్రంలో లెక్క కూడా చేయరన్న విషయాన్ని పాపం వీర్రాజు మరచిపోయినట్లున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: