సెటైర్ : టీడీపీ లో వారి గోలేంటి ? కవర్ చెయ్ బాబు ?

అంతేలే ముందొచ్చిన వారి కంటే, వెనకొచ్చిన వారు మీకు ఎక్కువ అయిపోయారా ? మిమ్మల్ని నమ్ముకుంటే ఇంత అవమానానికి గురి చేస్తారా ? అంతేలే అంటూ, ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు బాబోరిని ఏకి పారేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మేము అన్ని అమ్ముకుని ఎవరు పార్టీ కోసం గట్టిగా కష్టపడితే అవేమి పట్టించుకోకుండా, ఈ మధ్యనే పార్టీలో చేరిన కొత్త నేతలకు అవకాశం కల్పించి మాకు తగిన బహుమానం ఇచ్చారు. అంతేలే మిమ్మల్ని నమ్ముకున్నందుకు కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. అంటూ బాబు గారిని తెలుగు తమ్ముళ్ళు అదే పనిగా అభాసుపాలు చేస్తున్నారు. అసలు ఏంట్రా బాబు అనుకుంటూ బాబొరు నెత్తి మీద తుండు గుడ్డ వేసుకుని మరి, దాకొంటున్నారట పాపం. అసలు ఈ గోల కు కారణం చంద్రబాబు కొద్ది రోజుల క్రితం నియమించిన పార్టీ కమిటీలే కారణమట. ఎందుకంటే ఈ కమిటీల్లో కాస్త కుర్రతనం తో ఉన్న వారికి, ఆర్థికంగా బలవంతులకు బాబు పదవులు ఇచ్చారు. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం ఎన్నో కేసులు ఎదుర్కొని, నానా రకాల ఇబ్బందులు పడిన సీనియర్ తెలుగు తమ్ముళ్లకు మొండిచేయి చూపడం, అదేపనిగా మీడియాలో గొంతెత్తి మరి పార్టీ కోసం సర్వం ధారపోసిన వారికి, చాలు చాల్లే ఇక మీ పని అయిపోయింది... పక్కకు వెళ్ళండి అన్నట్లుగా దూరం పెట్టడంతో, వారంతా ఇప్పుడు బాబు గారి మీద దండయాత్ర చేసి, దండం పెట్టిచ్చే పనిలో ఉన్నారు. అనవసరంగా పార్టీ పదవులు ఇచ్చి కొత్త తలనొప్పి ఏంట్రా బాబు అని తెగ బాధపడిపోతూ, తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారట. అయితే పదవులు రాని తమ్ముళ్లు మాత్రం, మిమ్మల్ని ఆషామాషీగా వదిలిపెట్టం , మా తడాఖా చూపిస్తా మంట శపథం చేస్తుండడంతో ఎక్కడ కొంప ముంచుతారో తెలియక పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. అందుకే అసలు నన్ను ఏకిపారేసిన వారిని బుజ్జగించే ప్రయత్నం చేయాలని డిసైడ్ అయిన నాయకులు ఎవరా అని ఆరాధిస్తూనే, వారికి ఫోన్ చేసి బాబ్బాబ్బు ...మా సినబబు కోసం తప్పట్లేదు. కొత్త టీమ్ వేసి గుర్రం ఎక్కించెద్ధామని డిసైడ్ అయ్యాం. మీరు చిన్నదో పెద్దదో ఏదో ఒక మనసు చేసుకుని, ఈ సారికి ఇలా కానివ్వండి. మీకు పుణ్యం ఉంటుంది అంటూ తెగ బతిమిలాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఒకటే గుసగుసలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: