సెటైర్ : ట్విట్టుతూనే ట్విట్టించుకోకు సినబాబా ?

నానన్నారు సైకిల్ తొక్కి తొక్కి అసలైపోయారు. ఆయన ఇంకా తొక్కలేరు కాబట్టి మీరే కాస్త ఈ సైకిల్ తొక్కి పుణ్యం కట్టుకోండి అంటూ ఆ పార్టీ వొళ్ళు నెత్తి నోరూ బాదుకుంటూ, కాళ్లావేళ్లా బతిమిలాడుతుంటే పోన్లే పాపం అని ఇంట్లో కూర్చునే ట్రైనింగ్ తీసుకుంటూ అప్పుడప్పుడు టిట్టర్ పిట్టతో కాలక్షేపం చేస్తూ, అప్పుడప్పుడూ ఏదో ఒక విషయం మీద ట్విట్టుతూనే కాలక్షేపం చేసేస్తున్నాడు లోకేశం బాబు. అసలు ఎందుకు ట్విట్టుతున్నాడో కూడా తెలియకుండా ఆ జగన్ ను ట్విట్టడమే పనిగా పెట్టుకున్నాడు సినబాబు. అచలే ఉడుకు రకతం, కంది పప్పు, బాదం పప్పు, పెసరప్పు , ఆ పప్పు ఈ పప్పు అన్ని రకాల పప్పులూ వేసుకుని తిని బ్రెయిన్ పెంచేసుకుంటూ సరికొత్త వెర్షన్ లో వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు సిన బాబు.
సర్లే అసలు ఈ జగనుడిని ట్విట్టడం ఎప్పుడూ ఉండేదే కదా ఏమైనా సరికొత్తగా ట్విట్టుతున్నాడా అంటే అబ్బే మామూలుగా ట్విట్టడం లేదు. ట్విట్టిన ట్విట్లను ట్విట్టకుండా ట్విట్టుతున్నాడు. ఆ జగనుడు మీద కోపంతో ఏదో ఒకటి ట్విట్టలని చూస్తున్నా, ఏ ఇసయం మీద ట్విట్టాలో అస్సలు ఒక్కోసారి అర్ధం కావడంలేదు. అందుకే ఏదో ఒకటి ట్విట్టుతూ.. నేనున్నానోచ్ అంటూ చాటిచెప్పుకుంటున్నాడు. అసలు జనాలు మెచ్చిన నాయకుడుగా మారుతాడా అంటే అబ్బే హైదరాబాద్ వదిలి రావడమే లేదు. ఎక్కడెక్కడో జరిగిన సంగతులన్నీ ఆ జగనుడికి లింక్ పెట్టి మహా ఆనందపడిపోతున్నాడు.
మొన్న ఆ జగనుడు కరోనా వచ్చి తగ్గిపోయిన ఓ ఎమ్మెల్యే ఫోటో దిగుదామని సంబరబడుతూ వస్తే.. ఏమయ్యా ఫోటో దిగేటప్పుడు మూతికి మాస్క్ ఎందుకయ్యా అంటూ తీయించేస్తే, దాన్ని కూడా వదిలిపెట్టకుండా ... చూసారా నా ప్రజలారా ఈ జగనుడి దుర్మార్గం. ఆ జగన్ మూతికి ఎలాగు మాస్క్ లు గట్రా పెట్టుకోడు. ఆళ్ళ పార్టీవోల్లు పెట్టుకుంటే తీయించేస్తున్నాడు. ఇదెక్కడి దుర్మార్గం అంటూ ట్విట్టెత్తున్నాడు. బాబు సినబాబు ఇలాంటి సిల్లీ విమర్శలు మనకెందుకు కానీ, ముందు ఆ తెలంగాణ నుంచి ఏపీ కి రా....సామి.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: