సెటైర్ : మీరంతా అలా చేస్తే సిన బాబు సంగతో ?

అయిపోయింది ఏదో అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు కాస్త బాగుపడుతుంది అని అనుకుంటుంటే .. ఒక్కో నాయకుడు మళ్ళీ వలసబాట మొదలుపెట్టాడు. ఈ పార్టీలో ఉండడం ఎందుకు .. అనవసర తలపోట్లు తెచ్చుకోవడం ఎందుకు రా బాబు అనుకుంటూ చక్కగా జగన్ పార్టీలోకి జంపు చేసేందుకు ఎక్కువ మంది నాయకులు సిద్ధమవుతున్నారు. అసలు ఉన్నట్టుండి టిడిపి నుంచి ఈ వలసలు ఈ స్థాయిలో ప్రారంభం అవ్వడానికి కారణం ఎవరు అంటే ? అనే ప్రశ్న వస్తే చాలు అందరూ చినబాబు వైపే ఆవేశంగా, ఆగ్రహంగా, జాలిగా చేయి చూపిస్తున్నారు. చినబాబు మంచోడు అయినా, పార్టీని మాత్రం ముంచుతాడు అంటూ ఎవరికివారు సైడ్ అయిపోయేందుకే చూస్తున్నారు.

ఆగండి తమ్ముళ్లు నేను ఉన్నా, తెలుగుదేశం పిలుస్తోంది రండి, ఉండండి మళ్లీ మనకే అధికారం అంటూ, గొంతు చించుకున అదే పనిగా ప్రయధేయపడుతున్న.. పో పోవయ్యా..! జగన్ సంగతి మీకేం తెలుసు ? అయినా ఇప్పుడు కాకపోతే రేపు అయినా పార్టీ ని తీసుకువెళ్లి సినబాబు బాబు చేతిలో పెడతారు కదా ! అప్పుడు మా రాజకీయ భవిష్యత్తు ఏమైపోవాలి ? అంటూ తిరిగి అధినాయకుడునే ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. అయినా ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఉన్నా లేకపోయినా, తెలుగుదేశం సైకిల్ తొక్కే ది మాత్రం మన చినబాబే. సైకిల్ పార్టీ కిల్ అయిపోయినా ఫర్వాలేదు గాని, ఆ జూనియర్ ని , మరెవర్నీ ఈ పార్టీలోకి తెచ్చేది లేదని, ముంచినా తేల్చినా, అది మన లోకేశం బాబు మాత్రమే చేస్తారని ఇప్పటి నుంచే బాబు గారు పార్టీ ఓళ్లకు నూరిపోస్తున్నారు.

 బాబు చెప్పాడంటే చేసి చూపిస్తాడు కాబట్టి, మన నెత్తిన రుద్దడం తప్పదు అనే బెంగ పట్టుకుంది. తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా, తమకు దొరికిన పార్టీలోకి జంప్  చేసేస్తున్నారు. లాక్ డౌన్ ను లో ఎన్ని ట్రైనింగ్ లు ఇప్పించినా, ఈ జనాలకు ఏం తెలుసు ? సినబాబు బరువు తగ్గి, బాధ్యతలు పెంచుకునేందుకు సిద్ధమవుతున్నానని చెబుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. జగన్ పారిపోయేలా లోకేష్ బాబు తో ప్రసంగాలు ప్రాక్టీస్ చేయించినా,  నాయకుల్లో మాత్రం కంగారు మాత్రం పోలేదు. ఎవరు ఏమనుకున్నా, సినబాబు ఈ సైకిల్ పార్టీని ఏలతాడని బాబు గారు చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు ఈ పార్టీలో ఉంటే ఉండండి తమ్ముళ్ళు.. ఇకపోతే పోండి అని బాబు గారు స్టేట్మెంట్ ఇవ్వడమే తరువాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: