హెరాల్డ్ సెటైర్ : వీళ్ళెందుకు చంద్రబాబును మోస్తున్నారో తెలుసా ? అసలు విషయం ఏమిటి ?

Vijaya
పై ఫొటోలో ఉన్న ఇద్దరు ప్రముఖుల గురించి తెలుగునాట ఎవరికీ ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఒకరేమో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  చంద్రబాబునాయుడుకు రాజకీయ గురువైతే మరొకరు కుల గురువుగా ప్రచారంలో ఉన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా వీళ్ళద్దరి వ్యవహారం ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చంద్రబాబును తెర వెనుక నుండి నడిపించింది, ఆడించింది ఈ ఇద్దరే అని తెలుగుదేశంపార్టీ నేతలే బహిరంగంగా చెబుతుంటారు. చంద్రబాబుతో అంతటి బంధం ఉన్న ఈ ఇద్దరికి ప్రస్తుత రాజకీయాలు నిద్రపట్టనీయటం లేదట. కారణం ఏమిటంటే  రోజురోజుకు చంద్రబాబు బలహీనపడిపోతుండటమే. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ప్రస్తుత పరిణామాలే ఇందుకు సాక్ష్యం.  నిజానికి మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమితోనే చంద్రబాబుకు రాజకీయ పతనం ప్రారంభమైందనే చెప్పాలి. గడచిన ఏడాదిన్నరగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యవహరించిన విధానం కారణంగా అన్నీ వర్గాలకు దూరమై చివరకు ఒంటిరైపోతున్నాడు.



ఎలాగైనా చంద్రబాబుకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టాలని వీళ్ళిద్దరు శతవిధాల ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. వీళ్ళ ఆరటమంతా కేవలం చంద్రబాబు గురించే తప్ప తెలుగుదేశంపార్టీ గురించి కాదన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబును ముందుపెట్టి వెనుకనుండి షో రన్ చేయాలన్నదే వీళ్ళద్దరి టార్గెట్. ఎందుకంటే చంద్రబాబును పక్కనపెట్టేసి వీళ్ళే ముందుకొస్తే ఏమవుతుందో వీళ్ళకు బాగా తెలుసు. అందుకనే ఎంతసేపు తెరవెనుక పాత్రమే పరిమితమవుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో ఎలాగైనా టిడిపికే అధికారం దక్కేట్లుగా చాలానే శ్రమించారు. లేనివి ఉన్నట్లు, జరగనివాటిని జరిగిపోయినట్లు లేదా జరుగుతున్నట్లు తెగ చిత్రీకరిచాంరు.



అమరావతి రాజధాని నిర్మాణ పనులు  బ్రహ్మాండంగా జరుగుతున్నట్లు, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగిపోతున్నాయంటూ ఒకటే ఊదరగొట్టేశారు. అదే సమయంలో అవినీతి, అరాచకాలు, బంధుప్రీతి ఆకాశమంతగా చెలరేగిపోతున్నా బయటపడకుండా కవర్ చేయటానికి నానా అవస్తలు పడ్డారు.అయితే వీళ్ళు మరచిపోయిందేమంటే ఇది ఎన్టీయార్ కాలం కాదని. ఇది సోషల్ మీడియా కాలం. మెయిన్ మీడియాను సోషల్ మీడియా ఓ రేంజిలో ఆటాడేసుకుంటున్న ఈ కాలంలో వీళ్ళిద్దరి ఆటలు సాగలేదు. అందుకనే చంద్రబాబు పాలనను  జనాలు చీ కొట్టారు. సరే అధికారంలో నుండి దిగిపోయాకైనా ప్రతిపక్ష నాయకుడిగా అయినా రాణిస్తున్నాడా అంటే అదీలేదు. ప్రతి విషయంలోను ప్రభుత్వాన్ని అడ్డుకోవటం, కోర్టుల్లో కేసులు వేయించి ఇబ్బందులు పెట్టడమే. చంద్రబాబు వైఖరి కారణంగా పార్టీపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించటం లేదా ? లేకపోతే పై ఇద్దరు చంద్రబాబు కళ్ళకు గంతలు కట్టేశారా ? అన్నదే అర్ధం కావటం లేదు.



బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్లుగా క్షీణదశకు వచ్చేసిన టిడిపికి ఊపిరిలూదాలని పై ఇద్దరు నానా అవస్తలు పడుతున్నారు. ఎందుకంటే టిడిపి భవిష్యత్తుపైనే  వీళ్ళిద్దరి భవిష్యత్తు ఆధారపడుంది కాబట్టి. అందుకనే జాకీలేసి మరీ పార్టీని నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీని బతికించుకోవటం కోసం చంద్రబాబు కన్నా వీళ్ళద్దరే ఎక్కువ కష్టపడుతున్నారని పార్టీలోనే టాక్. ఇందులో భాగంగానే ప్రతిరోజు యధాశక్తి జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేస్తున్నారు.


ప్రజాబలంతో కాకుండా ఏదో పద్దతిలో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న కసి వీళ్ళలో ఎంతగా పెరిగిపోతోందో వీళ్ళ రాతలను బట్టే తెలిసిపోతోంది. ఒకవైపు జాకీలేసినా లేవలేకపోతున్న చంద్రబాబు. మరో వైపు రాజకీయంగా ఎందుకూ పనికిరానిచినబాబు.ఇదే సమయంలో తన పాలనతో జనాల్లో దూసుకుపోతున్న జగన్.దీంతో ఏమి చేయాలో అర్ధంకాక చంద్రబాబు, చినబాబు డెడ్ వెయిట్ అని తెలిసినా మోయలేక, అలాగని దింపేయలేక నానా అవస్తలు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: