సెటైర్ : హీరో విలన్ రెండూ ... నేనే నేనే.. నేనే

ఏ సినిమాకి అయినా హీరో ఉంటాడు. హీరో ఉంటే తప్పనిసరిగా విలన్ కూడా ఉండి తీరాల్సిందే. ఇది ఒక అనధికార రూలు కూడా. ఇప్పడు టీడీపీ అనే సినిమానే తీసుకుంటే, ఆ సినిమాలో హీరో నుంచి లైట్ బాయ్ వరకు అన్నీ తానే అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. బిలాడప్పా పాడా ? అంతకు మించి మరో గత్యంత్రం లేదు అనేది అందరికి తెలిసిందే. దీన్ని పట్టించుకోకండి. అసలు ఇప్పుడు ఈ టీడీపీ నావ ఏ తీరానికి కొట్టుకు వెళ్తుంది అనేది పెద్ద జవాబులేని ప్రశ్న. అవును ఇప్పుడు రాజకీయం అనే సముద్రం అల్లా కల్లోలంగా మారింది. విమర్శల గాలులు బలంగా వీస్తుండడంతో పాటు, సముద్రం పొంగి పొర్లే ప్రమాదం ఉండడంతో టీడీపీ నవ సునామీలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఆ పడవ నడిపే బాబు గారికి ఇప్పుడు వయసు పైబడడంతో బరువుగా మారిపోయింది.

ఇప్పుడు ఆ పడవను నడిపించే అనుభవం ఉన్న వారు కనిపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వేరే వారికి ఆ పడవను అప్పగించాల్సి పరిస్థితి. వారు టీడీపీ అనే పడవను తీరానికి చేర్చుతారో , మధ్యలోనే ముంచేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ అప్పగించక తప్పదు. లేకపోతే ఇప్పటికిప్పుడు ఆ పడవ మునిగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఆ భయంతోనే భారంగా ఉన్నా, అలసట పెరిగినా పడవను కుదుపులతోనే బాబు గారు నడిపించేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు అన్ని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఎవరి మీదా నమ్మకాల్లేవ్ .. కాదు కాదు నా కంటే సమర్ధుడు ఇంకొకరు లేరు అనే ఫీలింగ్.

పోనీ లోకేశానికి ఆ బాధ్యతలు ఇచ్చినా ఆయన పార్టీకి బరువవుతారు తప్ప పార్టీ బరువు మోయలేరు  అని బాగా తెలుసు. అందుకే ముక్కుతూనో మూలుగుతూనో బుజానకెత్తుకుని మరి బండి లాగించేస్తున్నారు. జూమ్ మీటింగ్ దగ్గర నుంచి పరామర్శ యాత్రల వరకు అన్నీ మీదేసుకుని చేస్తున్నాడు. ఒక రకంగా కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే నేనే అన్నట్టుగా బాబు గారు కష్టపడిపోతున్నాడు. అయినా అధికారంలో దక్కుతుందనే ఆశలు లేవ్.పోరాటాలు చేస్తూ ఆరాటపడిన ప్రయోజనాల్లేవ్. మీరు కూడా ఈ విషయాలపై నమ్మకం పెట్టుకోకండిరా తమ్ముళ్లూ అని చెప్తున్నా, బాబు గారు ఏదో కొత్త అవతారంలో దర్శనం ఇచ్చి కామెడీ చేస్తారని, ఆయన దశావతారాల్లో పరకాయ ప్రవేశం చేస్తారని, నమ్ముతున్నారు. కొంతమంది మాత్రం అసలు బాబు హీరో, విలన్ కాదు ఏది చేసినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్లాప్ షో అని తేల్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: