టీమిండియా సిరీస్ గెలవాలంటే.. అలా చేయాల్సిందే : హర్భజన్

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా మరికొన్ని రోజుల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కాబోయే బోర్డర్ గవాస్కర్  ట్రోఫీ గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ఎవరు ఎలాంటి ప్రదర్శన చేస్తే బాగుంటుంది అనే విషయంపై తమ రివ్యూలను ఇస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉన్నారు.

 కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన వార్తలే క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇటీవల భారత్,  ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరగబోతున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ గురించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు శుభమన్ గిల్ ను ఓపెనింగ్ జోడీగా పంపించాలి అంటూ సూచించాడు. ఇక అన్ని మ్యాచ్ లలో కూడా ఇదే ఓపెనింగ్ జోడిని కంటిన్యూ చేయాలి అంటూ తెలిపాడు.

 అలా అయితేనే టీమ్ ఇండియా గెలిచే ఛాన్స్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గీల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇక రోహిత్ కూడా మంచి ఓపెనరే. కానీ గత కొంతకాలం నుంచి అంచనాలు అందుకోలేకపోతున్నాడు అంటూ హర్భజన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇకపోతే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలి అంటే టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా పై ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం తప్పనిసరిగా మారిపోయింది. ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: