దంచి కొట్టిన ఆర్సిబి కెప్టెన్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?

praveen
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టి20 లీగ్ లో భాగంగా అటు ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకున్నవారు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవరైనా ఐపీఎల్ స్టార్ ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికా లీగ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అంటే చాలు ఇక అతని గురించిన వార్త అటు భారత క్రికెట్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పాలి.  ఇకపోతే గత ఏడాది జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్లి ఇక జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు సౌత్ ఆఫ్రికా లెజెండ్ ఫాబ్ డూప్లిసిస్.

 ఇక ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో కూడా ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే జోహానెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు ప్రస్తుతం ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్ లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  ఇక ఇటీవల సన్రైజర్స్ జట్టును చిత్తుగా ఓడించాడు డూప్లెసెస్. వండరర్స్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో జోహన్ నెస్ బర్గ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలోనే ఓపెనింగ్ వచ్చిన ఫాబ్ డూప్లిసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇక మరోపణ రీజో హేండ్రిక్స్( 40) నుంచి కూడా అతనికి మంచి సహకారం అందింది అని చెప్పాలి. ఇక తర్వాత మిగతా ఎవరు పెద్దగా రాణించలేదు.

 నిర్ణీత 20 ఓవర్లలో జోహేరన్నస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టు  160 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ తర్వాత మోస్తారు లక్ష్య చేదనతో బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టుకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు ఓపెనర్లు కూడా తక్కువ పరుగులకే వెనుతిరి గారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎంత పోరాడినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో 20 ఓర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది సన్రైజర్స్. దీంతో సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.  అయితే ఆర్సిబి కెప్టెన్ డుప్లెసెస్ మెరుపు ఇన్నింగ్స్ తో ఇక బెంగుళూరు అభిమానులకు కూడా సంతోషంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: