న్యూజిలాండ్ కే కాదు.. టీమిండియాకు అదే పరిస్థితి?

praveen
సాధారణంగా టి20 మ్యాచ్ అంటే చాలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కాదు నువ్వా నేనా  అన్నట్లుగానే పోరు సాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఒకరికి మించి ఒకరు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్ కి ప్రపంచ క్రికెట్లో ఎక్కువగా పాపులారిటీ పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక టి20 మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక ఇలా టీ20 ఫార్మాట్లో ఏ మ్యాచ్ జరిగిన కూడా అది ఊహకదని రీతిలో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంటుంది. అయితే ఇటీవల భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం టెస్ట్ క్రికెట్ కంటే దారుణంగా జరిగింది అని చెప్పాలి. ట20 ఫార్మాట్లో జరిగిన మ్యాచ్ ఎంత చప్పగా ఉంది ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా అనుకునే విధంగా ఈ మ్యాచ్ జరిగిందని చెప్పాలి. ఇటీవల భారత్ న్యూజిలాండ్ జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్. ఈ క్రమంలోనే భారత బౌలింగ్ విభాగం విజృంభించడంతో  99 పరుగులకు ఆల్ అవుట్ అయింది కివిస్.

 అయితే ఎంతో మంది స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్న టీమ్ ఇండియా ఇక ఈ చిన్న టార్గెట్ ను ఎంతో అలవోకగా చేదిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అంతకుముందు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. ఆ తర్వాత భారత్ పరిస్థితి కూడా ఇదే విధంగా మారిపోయింది. న్యూజిలాండ్ ఆరు ఫోర్లు కొడితే భారత బ్యాట్స్మెన్లు 8 ఫోర్లు కొట్టారు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు   ఇలా 99 పరుగులను చేదించేందుకు చెమటోడ్చాల్సి వచ్చిందని చెప్పాలి. చివరికి టి20 మ్యాచ్ కాస్త టెస్ట్ మ్యాచ్ ను తలపించింది. దీంతో ఈ మ్యాచ్ చూసిన ప్రేక్షకులకు కూడా బాగా చిరాకు వచ్చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: