వాళ్లకి పని పాట లేదు.. బాబర్ నా కొడుకుతో సమానం : వసీం అక్రమ్

praveen
సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త తెరమీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయినట్లుగానే అటు క్రికెటర్లకు సంబంధించిన వార్తలు కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఏకంగా క్రికెటర్ల మధ్య విభేదాలు ఉన్నాయి అన్న వార్తలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసిమ్ అక్రమ్ ప్రస్తుత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్  మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని ఇక ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది.

 ఇక ఈ విభేదాల కారణంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ ను వదిలిపెట్టిన బాబర్ షెఫవర్ జట్టుకి మారాడు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలు ఇక ఇద్దరు క్రికెటర్ల అభిమానులను కూడా అvaaక్కాయ్యేలా చేశాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి. నేను బాబర్  పై ఎప్పుడు అసంతృప్తి వ్యక్తం చేయలేదు.  కానీ కొంతమంది పని పాట లేని వాళ్ళు ఇలాంటి వార్తలు రాస్తూ ఉంటారు.

 అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఇక సోషల్ మీడియాలో ఇక ఇలాంటి వార్తలనే వండుతూ కడుపు నింపుకుంటారు. నా జీవితంలో ఇలాంటి వాళ్లను ఒక్కసారి కూడా కలవలేదు. ఇక ఫ్రాంచైజీ క్రికెట్లో ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారడం సర్వసాధారణంగా జరుగుతుంది. అది ఫ్రాంచైజీ ఓనర్ల మీద ఆధారపడి ఉంటుంది. నా మీద కాదు. బాబర్ తో ఎప్పుడు నేను టచ్ లోనే ఉంటాను. అతను నా కొడుకుతో సమానం అతనితో విభేదాలు అస్సలు లేవు అంటూ వసీం అక్రమ్ చెప్పుకు
చ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: