ప్చ్.. అర్షదీప్ ఇలా చేసావేంటి.. చెత్త రికార్డు?

praveen
ఇటీవల కాలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకుని  బాగా రాణిస్తున్నారు. ఇక ఇలా తన బౌలింగ్ తో తక్కువ సమయంలోనే కీలక ఆటగాడిగా మారిపోయాడు అర్షదీప్ సింగ్. సరిగ్గా బుమ్రా గాయం బారిన పడి జట్టుకు దూరమైన సమయంలో ఇక టీమిండియాలోకి అడుగుపెట్టాడు. అయితే ఇక బుమ్రా లేకుండా టీమిండియా ఎలా ముందుకు సాగుతుందో అనుకుంటున్న సమయంలో తన బౌలింగ్తో అందరికీ నమ్మకాన్ని కలిగించాడు.

 ఎంతో అద్భుతమైన బౌలింగ్ తో వికెట్లు పడగొట్టి ఇక టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం అర్షదీప్ సింగ్ ను డెత్ ఓవర్ల ఫియర్ బాగా వేధిస్తూ ఉంది అని చెప్పాలి. మిడిల్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేసి పరుగులు కట్టడం చేస్తూ వికెట్లు పడగొడుతున్న అర్షదీప్  డెత్ ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో ఇక ఇలా అర్షదీప్ డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వడం ఇండియా ఓటమికి కారణం అవుతుంది అని చెప్పాలి. మరోసారి డెత్ ఓవర్ లలో ఫియర్ తో అటు అటు అర్షదీప్ చెత్త బౌలింగ్ తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 ప్రస్తుతం న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా జట్టు టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల మొదటి మ్యాచ్ లో భాగంగా టీమ్ ఇండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 51 పరుగులు సమర్పించుకున్నాడు అర్షదీప్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే అర్షదీప్ పేరిట ఒక చెత్త రికార్డు నమోదయింది. టి20 లో అత్యధికంగా 22 మ్యాచ్ 14 నోబాల్స్ వేసిన బౌలర్గా మొదటి స్థానంలో నిలిచాడు అర్షదీప్. ఇక తర్వాత 11 నో బాల్స్ తో హసన్ అలీ, కిమోపాల్, ఓషన్ థామస్ ఉన్నారు. ఇక అర్షదీప్ లాంటి బౌలర్ ఇలా కీలక సమయంలో చేతులెత్తేస్తూ ఉండడం అటు టీమ్ ఇండియాను దెబ్బతీస్తూ ఉంది అని చెప్పాలి. అయితే వన్డే సిరీస్ గెలిచిన జోరును  టి20 సిరీస్ లో కొనసాగిస్తుంది అనుకున్నప్పటికీ టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ వేసింది న్యూజిలాండ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: