వరల్డ్ కప్ టీమ్ పై.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న టీమ్ ఇండియాకు గత కొన్నేళ్ళ నుంచి మాత్రం వరల్డ్ కప్ అనేది అందరిని ద్రాక్ష లాగే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. దాదాపు టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవక 15 ఏళ్లు గడిచిపోతుంది. ఇక ప్రతి ప్రపంచ కప్ టోర్నీలో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం ఆ తర్వాత సరైన ప్రదర్శన చేయలేక నిరాశపరచడం చేస్తూ వస్తుంది టీమ్ ఇండియా. కొన్ని కొన్ని సార్లు చివరి అడుగులో కూడా తడబడిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో అటు భారీ అంచనాల మధ్య బలిలోకి దిగి సెమీ ఫైనల్లో ఓడిపోయి నిష్క్రమించింది టీమిండియా.

 అయితే ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అందరూ ఆటగాళ్ళు మంచి ఫామ్ లో కొనసాగుతున్న నేపథ్యంలో ఇక వరల్డ్ కప్ లో ఎవరిని ఎంపిక చేస్తారో అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టులో ఎంపిక చేసే ఆటగాళ్ళలో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు.

 ఇక వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేసే టీం ప్లేయర్ల విషయంపై ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. భవిష్యత్తులో జరిగే టోర్నీలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం టీమిండియా ఎంపిక జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం ఇస్తామని అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రం ఆటగాళ్ల చేతుల్లోనే ఉంటుంది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక జట్టులోకి వచ్చేందుకు చాలా మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: