రంజీ ఫైనల్ కు జడేజా.. వెల్కమ్ చెబుతున్న ఫ్యాన్స్?

praveen
టీమ్ ఇండియా జట్టులో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. సరిగ్గా వరల్డ్ కప్ కి ముందు అటు జడేజా లాంటి కీలకమైన ప్లేయర్ దూరం కావడంతో టీమ్ ఇండియా వ్యూహాలు  మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయాయి. మోకాలికి గాయం కావడం కారణంగా ఇక రవీంద్ర జడేజా శస్త్ర చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స అనంతరం ఇక అతనికి బెడ్ రెస్ట్ అవసరం కావడంతో.. కొన్ని నెలల నుంచి టీమ్ ఇండియాకు అందుబాటులో లేకుండా పోయాడు.

 జడేజా లాంటి కీలకమైన ఆల్ రౌండర్ లేకపోవడంతో ఇక అతని స్థానాన్ని భర్తీ చేయడానికి టీమిండియా ఎంతో మంది ఆటగాళ్లతో ప్రయత్నాలు చేసింది. కానీ యువ ఆటగాళ్లు ఎవరూ కూడా జడేజాలాగా స్పిన్ బౌలింగ్లో వికెట్లు పడగొట్టడమే కాదు బ్యాటింగ్లో రాణించలేకపోయారు. దీంతో ఇక జడేజా స్థానాన్ని  భర్తీ చేయడం కష్టమే అన్న విషయంపై టీం ఇండియా సెలెక్టరు ఒక క్లారిటీ కి వచ్చారు అని చెప్పాలి. అయితే రవీంద్ర జడేజా మోకాలి సర్జరీ గాయం నుంచి కోరుకున్నాడు.  అయితే అతను ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ముందుగా రంజీ ట్రోఫీలో ఆడాలని ఒక మెలిక పెట్టారు బిసిసిఐ సెలెక్టర్లు.

 ఈ క్రమంలోనే అటు రవీంద్ర జడేజా సైతం మళ్లీ మైదానంలోకి దిగి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు గాయం నుంచి కోలుకున్న జడేజా రంజీ ట్రోఫీ ఫైనల్ లీగ్ కోసం సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. ఇందుకోసం చెన్నై వచ్చాడు. అక్కడి అభిమానులను ఉద్దేశించి వణక్కం చెన్నై అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. వెల్కమ్ బ్యాక్ చెన్నై సూపర్ కింగ్.. మా అభిమాన ప్లేయర్ కి చెన్నై నగరం స్వాగతం పలుకుతుంది అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా ఆస్ట్రేలియాతో జరగబోయే రెండు టెస్టులకు కూడా అటు జడేజా ఎంపిక అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: