ఇదెక్కడి కీపింగ్ రా నాయనా.. బాల్ చేతిలో ఉన్న ఔట్ చేయలేదు?

praveen
వరల్డ్ క్రికెట్లో ఎన్ని జట్లు ఉన్నప్పటికీ అటు పాకిస్తాన్ జట్టు తీరే వేరు అని చెప్పాలి . పాకిస్తాన్ ఎప్పుడు ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అన్నది అటు ప్రేక్షకుల ఊహకంగానే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఓడిపోవడం ఖాయం అనుకున్న క్లిష్ట పరిస్థితుల నుంచి అద్భుతంగా పుంజుకొని విజయం సాధించి ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో విజయం సాధిస్తుంది అన్న సందర్భంలో ఇక చేజేతులార చేసిన తప్పులతో ఓడిపోతుంది. అంతేకాదు ఫీల్డింగ్ విషయంలో బ్యాటింగ్ విషయంలో బౌలింగ్ విషయంలో ఇలా అన్ని విషయాల్లో కూడా ప్రపంచ క్రికెట్లో  ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది పాకిస్తాన్ జట్టు.

 పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రవర్తన పై ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ మెన్స్ టీం తో పోల్చి చూస్తే ఉమెన్స్ టీం కాస్త భిన్నమైనది అని చెప్పాలి. పాకిస్తాన్ మెన్స్ టీమ్  కొన్ని కొన్ని సార్లు ట్రోలర్లకు దొరికిపోతూ ఉంటుంది.  ఇక ఉమెన్స్ టీం అయితే బ్యాటింగ్ ఫీల్డింగ్ లలో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ ఉమెన్ క్రికెటర్ ఒకరు ట్రెండింగ్ లో నిలిచారు.

 ప్రస్తుతం పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అటు వన్డే సిరీస్ జరుగుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే జరిగిన మూడో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఉమెన్స్ టీం వికెట్ కీపర్ గా ఉన్న మునిబా అలీ ఆడిన తీర్పు విమర్శలు వస్తున్నాయి. బ్యాటర్ ను సునయాసంగా అవుట్ చేసే ఛాన్స్ ను వదులుకుంది మునీబా. బ్యాటర్ జోననాస్ 8 పరుగుల వద్ద బాటింగ్ చేస్తున్న సమయంలో ఫాతిమా బౌలింగ్లో షాట్ ఆడింది. అయితే క్రీజు వదిలి ముందుకు వచ్చి ఆడే ప్రయత్నంలో బాల్ ఎడ్జ్ తగిలి అక్కడే పడింది.. రన్ తీసేందుకు ప్రయత్నించగా వికెట్ల వెనుక ఉన్న మునిబా అని పరిగెత్తుకొచ్చి బాల్ ను పట్టుకుంది. కానీ రన్ అవుట్ చేయడంలో మాత్రం విఫలమైంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: