రిటైర్మెంట్ ప్రకటించిన.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో యువ ఆటగాళ్లదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. దేశవాలి క్రికెట్ లో మంచి ప్రదర్శన చేస్తున్న యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో సెలెక్టర్ల చూపును ఆకర్షిస్తూ ఇక అంతర్జాతీయ జట్టులోకి వస్తూ ఉన్నారు. ఇక ఇలా అంతర్జాతీయ మ్యాచ్లలో కూడా ఎక్కడ ఒత్తిడికి లోను కాకుండా మంచి ప్రదర్శన చేస్తూ తమ స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు ఇక అన్ని దేశాలలో కూడా ఇదే జరుగుతుంది. ఇక ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా తమ జట్టును యువ ఆటగాళ్లతో పటిష్టం చేసుకునేందుకే ఎక్కువగా మగ్గుచూపుతు ఉండడం గమనార్హం.

 ఇకపోతే ఇక ఇలా ప్రపంచ క్రికెట్లో యువ ఆటగాళ్ల హవా ఎక్కువైన నేపథంలో ఇక అప్పటివరకు స్టార్ క్రికెటర్లుగా కొనసాగి ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన వారు మళ్ళీ జట్టులో చోటు సంపాదించుకోవడం మాత్రం అసాధ్యంగా మారింది అని చెప్పాలి. అయితే దేశవాళి క్రికెట్లో బాగా రానించి.. జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న.. ఇక అలాంటి అవకాశం రాకపోవడంతో చివరికి ఎంతోమంది నిరాశతో ఇక తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉన్నారు సీనియర్ ప్లేయర్లు. ఇటీవల సౌత్ ఆఫ్రికా క్రికెటర్  ఆమ్లా సైతం ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు.

 ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో సీనియర్ ఆల్రౌండర్ గా కొనసాగుతున్న డాన్ క్రిస్టియన్ సైతం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని చెప్పాలి. తను అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ లీగ్ లో ఆడుతూ ఉన్నాడు డాన్ క్రిస్టియన్. అయితే ఇక ఈ టోర్నీ పూర్తయిన తర్వాత ఆటకు దూరంగా ఉంటాను అంటూ వెల్లడించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. 2006లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన క్రిస్టియన్ ఇప్పటివరకు అన్ని టి20 లకు కలిపి 405 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 5809 పరుగులు చేసి  రెండు వందల ఎనభై తొమ్మిది వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా తరఫున 20 వన్డేలు 20 మూడు టి20 మ్యాచ్ లు ఆడిన క్రిస్టియన్.. ఐపిఎల్ లో పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: