ధోని కొత్త లుక్ వైరల్.. అభిమానులు ఫిదా?

praveen
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినిపించింది అంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఆ రేంజ్ లో తన క్రికెట్ ప్రస్థానాన్ని  కొనసాగించాడు మహేంద్రుడు. భారత క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు 2019లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికీ ఏళ్లు గడిచి పోతున్నాయి కానీ ఇంకా ధోని కి ఉన్న క్రేజ్ మాత్రం  ఇసుమంతైన తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అందరి క్రికెటర్ల లాగా ధోని అటు అభిమానులతో సోషల్ మీడియాతో ముచ్చటించడం లాంటివి అస్సలు చేయడు. కనీసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విషయంలో కూడా దూరంగానే ఉంటాడు. అయినప్పటికీ ధోనికి సంబంధించిన వార్త మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. ఇక ధోని కొత్త లుక్ లో కనిపించాడు అంటే చాలు ఆ వార్త క్రికెట్ అభిమానుల దృష్టిని తెగ ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

 టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కొత్త అవతారం ప్రస్తుతం అభిమానులందరిని ఫిదా చేస్తుంది. మరో రెండు నెలల్లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక ధోని మళ్లీ తన ప్రాక్టీస్ ప్రారంభించాడు. మళ్లీ మైదానంలోకి దిగి బ్యాట్ పట్టి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ధోని ప్రాక్టీస్కు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇటీవల తన ప్రాక్టీస్ సెషన్ను ముగించుకొని బయటకు వస్తున్న ధోని తెల్ల గడ్డం నల్ల జుట్టుతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అభిమానుల కంటపడ్డాడు. అయితే ధోనిని ఎప్పుడూ ఇలాంటి లుక్ లో చూడలేదు అభిమానులు. దీంతో ధోని ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మార్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: