టీమ్ ఇండియాను వణికించి.. ప్రేక్షకులు హృదయాలు గెలిచాడు?

praveen
సాధారణంగా ఎలాంటి క్రీడల్లో అయినా సరే గెలుపు ఓటములు అనేవి సహజం అన్న విషయం తెలిసిందే. కానీ ప్రతి జట్టు కూడా గెలవాలని లక్ష్యంతోనే బరిలోకి దిగుతూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇక గెలుపు కోసం చేసే పోరాటంలో చిన్న చిన్న తప్పుల కారణంగా ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.  అయితే ఇక సాధారణంగా అయితే విజయం సాధించిన జట్టులో ఉన్న ఆటగాళ్ల గురించి ఎప్పుడూ ప్రేక్షకులు చర్చించుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఏకంగా విజయం సాధించిన జట్టులో ఉన్న ఆటగాళ్ల కంటే ఓడిపోయిన జట్టులో ఉన్న ఆటగాళ్ల పేరు మారుమోగిపోతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇక ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా మొదటి  మ్యాచ్లో ఇలాంటిదే జరిగింది. గెలిచిన భారత ఆటగాళ్ల ప్రదర్శన కంటే అటు ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టులో ఉన్న ఆటగాడు బ్రేస్ వెల్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే పీకలోతు కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్ జట్టును అతను గెలిపించినంత పని చేశాడు. దీంతో అతను వీరొచిత పోరాటంకి అటు ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోయారు. దీంతో న్యూజిలాండ్ ఓడిన కూడా అతను ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు అని చెప్పాలి.

 130 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.. ఇక కివీస్ మొదటి వన్డే మ్యాచ్ లో ఓడిపోవడం ఖాయమని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో ఒంటి చేత్తో ఇక జట్టును విజయం వైపు నడిపించాడు బ్రేస్ వెల్. ఒకవైపు సహచర బ్యాట్స్మెన్లు వరుసగా వికెట్లు కోల్పోతున్న.. అతడు మాత్రం ఒత్తిడికి లోను కాలేదు. ఏకంగా ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు అని చెప్పాలి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 78 బంతుల్లోనే 12 ఫోర్లు 10 సిక్సర్ల సహాయంతో 110 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ చివర్లో అతని బ్యాటింగ్ విధ్వంసం స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాని పంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: