అయ్యోపాపం.. కేవలం 2 గంటలే.. నెంబర్.1 ర్యాంక్ లో టీమిండియా?

praveen
ప్రపంచ క్రికెట్లో ఉన్న ఆయా జట్ల ప్రదర్శన ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ర్యాంకింగ్స్ ని ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్ కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతాయి. అయితే ఒకసారి ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగిన జట్టు ఒకవేళ మంచి ప్రదర్శన చేయకపోతే కొన్నాళ్ళకి ఇక ఆ స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కు వింత పరిస్థితి ఎదురైంది అని చెప్పాలి.

 కొన్ని రోజులపాటు కాదు కేవలం రెండు గంటల పాటు మాత్రమే అటు టీమిండియా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పాలి. దీంతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఇక తర్వాత సాంకేతిక తప్పిదం జరిగింది అన్న విషయాన్ని గ్రహించిన ఐసిసి ర్యాంకింగ్స్ ని సరి చేసింది. దీంతో రెండు గంటల వ్యవధిలోనే మొదటి స్థానంలో ఉన్న టీమిండియా కాస్త రెండవ స్థానంలోకి వెళ్లిపోయింది.

 ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. వాస్తవానికి అయితే ఎన్నో రోజుల నుంచి ఆస్ట్రేలియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇటీవలే బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ విజయం సాధించిన టీమిండియా జట్టు ఐసిసి ర్యాంకింగ్స్ లో రెండవ స్థానానికి చేరుకుంది.  మూడవ స్థానంలో ఇంగ్లాండ్ కొనసాగుతుంది అని చెప్పాలి. కానీ ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానంలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఇక ఇంగ్లాండ్ మూడవ స్థానంలో నిలిచాయి. కానీ సాంకేతిక తప్పిదం అని భావించి మళ్లీ సరిచేసింది ఐసీసీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: