కోహ్లీ, రోహిత్ లను.. అందుకే టి20లకు సెలెక్ట్ చేయడం లేదు : గవాస్కర్

praveen
ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ క్రికెటర్లుగా ప్రపంచ క్రికెట్లో అత్యంత ఆటగాళ్లుగా కొనసాగుతూ ఉన్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఒకప్పుడు విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపడితే.. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ సారధిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఈ ముగ్గురు ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తూ ఉంటారు. అయితే గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా పేలువమైన ప్రదర్శన చేసింది కప్పు గెలుచుకుని వస్తుంది అనుకున్న టీమిండియా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ఇక వరల్డ్ కప్ ముగిసిన నాటి నుంచి కూడా అటు టి20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేయడం లేదు. శ్రీలంకతో టి20 సిరీస్ తో పాటు ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో జరగబోయే టి20 జట్టులో కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పేరు కనిపించకపోవడం గమనార్హం. అయితే రోహిత్, కోహ్లీలను ఇక టి20 లో చూడలేమా అనే అనుమానం అభిమానుల్లో మొదలైంది. దీనిపై బీసీసీఐ కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వకుండా  మౌనం వహిస్తుంది అని చెప్పాలి.

 ఇదే విషయంపై మాట్లాడిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఉంది. కొత్త సెలక్షన్ కమిటీ యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అనుకుంటుంది. అంటే ఇకపై విరాట్ కోహ్లీ, రోహిత్ లను పరిగణలోకి తీసుకోరు అని కాదు.. ఈ ఏడాదంతా వారిద్దరూ మంచి ఫామ్ లో ఉంటే జట్టులో ఉంటారు. కీలకమైన ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ కోసం జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న ఇద్దరికీ కూడా సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని భావించి ఉండవచ్చు. ఈ విశ్రాంతి కారణంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా నూతన ఉత్సాహంతో బరిలోకి దిగి అవకాశం ఉంది. ఇది నిజంగానే భారత జట్టుకు మేలు చేస్తుంది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: