ఐపీఎల్ ఒక గేమ్ చేంజర్.. మిథాలీ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
మహిళ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా గత కొంతకాల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగానే పారితోషకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే కాదు ఇక ఇప్పుడు మెన్స్ క్రికెటర్లకు నిర్వహించినట్లుగానే మహిళా క్రికెటర్లకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది యువ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించుకుంది అని చెప్పాలి.

 ఇక ఇందుకు సంబంధించిన అన్ని సన్నాహాలను కూడా పూర్తి చేసింది బీసీసీఐ. అయితే ఉమెన్స్ ఐపీఎల్ టోర్నమెంట్ కు సంబంధించిన మీడియా హక్కులని 951  కోట్లకి వయకామ్ 18 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వచ్చే వారంలో ఐదు ఫ్రాంచైజీల పేర్లను కూడా బీసీసీఐ ప్రకటించబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక మార్చి నెలలోనే తొలి మహిళ ఐపిఎల్ సీజన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  వయకామ్ 18 సంస్థ ఇక మహిళల ఐపీఎల్ సోషల్ మీడియా హక్కులను సొంతం చేసుకోవడంపై బీసీసీఐ కార్యదర్శి ఆనందం వ్యక్తం చేశారు.

జై షా పెట్టిన పోస్ట్ పై స్పందించిన భారత మహిళా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అని చెప్పాలి. మహిళా ఐపీఎల్ తప్పకుండా ప్రతి ఒక్క ప్లేయర్ జీవితంలో గేమ్ చేజర్గా మారుతుంది అంటూ అభిప్రాయపడ్డారు.   మహిళల క్రికెట్కు ఆదరణ పరుగేందుకు ఇక ఈ టోర్ని ఎంతగానో ఉపయోగపడుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక వయకామ్ 18 భారీ బిడ్ ఇందుకు నిదర్శనమని మిథాలీ రాజ్ తెలిపారు. ఈ బిడ్ మహిళా క్రికెట్లో ఒక మైలురాయి అని చెప్పవచ్చు.  ఇక అద్భుతమైన ఐపీఎల్ టోర్నమెంట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ మిథాలీ రాజ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: