వన్డే వరల్డ్ కప్పే కాదు.. టి20 వరల్డ్ కప్ కు కూడా పంత్ డౌటే?

praveen
టీమ్ ఇండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇటీవలే ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే   ఏకంగా ఉత్తరాఖండ్లోని రూర్కీ ప్రాంతంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. వేగంగా దూసుకుపోతున్న కారు ఇక రహదారి పక్కన ఉన్న రైలింగ్ ను ఢీ కొట్టి 200 మీటర్ల వరకు దూసుకుపోయింది. అయితే ఈ ఘటనలో అటు రిషబ్ పంత్ బిఎండబ్ల్యూ కారు పూర్తిగా ఖాళీగా అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రమాదంలో అటు రిషబ్ పంత్ కు కూడా తీవ్ర గాయాలు కావడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు రిషబ్ పంత్.

 అయితే అటు రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు అని బిసిసిఐ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో అటు అభిమానులు అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పాలి. కానీ రిషబ్ పంత్ ఇక గాయాల నుంచి పూర్తిగా కోలుకొని మళ్ళీ మునుపటి ఫిట్నెస్ సాధించి ఎప్పుడు భారత జట్టులోకి వస్తాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కి.. అంతే కాకుండా ఇక ఈ ఏడాదిలో జరగబోయే ఐపీఎల్ సీజన్ కి కూడా రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం కష్టమే అన్నదానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక ఏడాది వరల్డ్ కప్ కి కూడా రిషబ్ పంత్ అందుబాటులోకి రాడు అని చెప్పాలి.

 అయితే రిషబ్ పంత్ గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేవలం 6, 7 నెలలు మాత్రమే కాదు దాదాపు మరో 18 నెలల పాటు క్రికెట్ కి దూరంగా ఉండడం ఖాయం అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే 2024 లో జరిగే టి20 వరల్డ్ కప్ కి కూడా రిషబ్ పంత్ దూరం కాబోతున్నాడు అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రిషబ్ పంత్ వికెట్ కీపర్ కాబట్టి అతని ప్రతి కదలికలు కూడా మోకాలి పై భారం వేయాలి. అయితే ఇప్పుడే అది సాధ్యం కాదు అని చెప్పాలి. అందుకు చాలా సమయం అవసరం అంటూ వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: