సమన్వయ లోపం.. మ్యాచ్లో అపశృతి.. వైరల్ వీడియో?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల మధ్య కోఆర్డినేషన్ ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఆటగాళ్లు మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోతే ఎన్నో తప్పులు జరిగిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు వికెట్లు పడటం మరికొన్నిసార్లు క్యాచ్ డ్రాప్ అవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కేవలం ఇలాంటి తప్పిదాలు మాత్రమే కాదు ఇక మరికొన్నిసార్లు కోఆర్డినేషన్ లోపం కారణంగా ఆట ఆటగాళ్లు తీవ్రంగా గాయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.

 ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇప్పటివరకు ఎన్నో మ్యాచులలో జరిగాయి అని చెప్పాలి. ఇక ఇటీవల భారత్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఆటగాళ్లకు మధ్య ఉన్న సమన్వయ లోపం కాస్త చివరికి ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. బౌండరీ వద్ద ఫోర్ వెళ్తున్న బంతిని ఆపాలనే ప్రయత్నంలో సమన్వయ లోపం కారణంగా ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. కనీసం లేవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఫిజియోథెరపీస్టులు వచ్చి వారిని స్ట్రక్చర్ పై తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 భారత ఇన్నింగ్స్ 43 ఓవర్లో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. కరుణ రత్నే బౌలింగ్లో విరాట్ కోహ్లీ బంతిని బౌండరీ తరలించే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని ఆపేందుకు డీప్ స్క్వేర్, మిడ్ వికెట్ ఫీల్డర్లు వండర్ సే,  ఆషేన్ బండార ఇద్దరు ప్రయత్నించారు.  ఇక ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరినొకరు బలంగా ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ మైదానంలో కుప్పకూలిపోయారు. కనీసం లేవడానికి కూడా రాలేని పరిస్థితి. దీంతో వెంటనే బీసీసీఐ మెడికల్ టీం కూడా గ్రౌండ్లోకి వచ్చి పరిస్థితి సీరియస్ గా కనిపించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటన ప్రేక్షకులను కూడా షాక్ కు గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: