మెలిక పెట్టిన బీసీసీఐ.. రంజి ట్రోఫీలో జడేజా?

praveen
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి . ఒకప్పుడు రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దక్కుతుందా లేదా అని అనుమానాలు ఉండే పరిస్థితి నుంచి ఇక రవీంద్ర జడేజా లేకపోతే టీమిండియా గెలవడం కష్టం అనే స్థాయికి తన ప్రదర్శనతో ఎదిగాడు రవీంద్ర జడేజా. ఇక టీమ్ ఇండియాలో కీలక ఆల్రౌండర్ గా కొనసాగుతూ జట్టు విజయంలో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ వచ్చాడు అని చెప్పాలి. మా జట్టులో రవీంద్ర చెడేజా లాంటి ఆల్ రౌండర్ లేడు అని ప్రత్యర్థి జట్లు సైతం  బాధపడే విధంగా అతని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి.

 జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి మెరుపు ఇన్నింగ్స్ ఆడే రవీంద్ర తన స్పిన్ బౌలింగ్ తో కూడా వికెట్లు పడగొడుతూ అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. మరోవైపు మైదానంలో మెరుపు వేగంతో కదులుతూ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా తన ఫీల్డింగ్ విన్యాసాలను కూడా ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే గత కొంతకాలం క్రితం మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు శస్త్ర చికిత్స జరగడంతో దాదాపు కొన్ని నెలల నుంచి ఇక్కడ టీమిండియాలో కనిపించడం లేదు.  అయితే మరికొన్ని రోజుల్లో అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతుంది.

 ఇలాంటి సమయంలో ఇక టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు  క్రికెట్ బోర్డు యాజమాన్యం ఒక మెలిక పెట్టింది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో ఇక రవీంద్ర జడేజా తుదిజట్టులోకి రావాలంటే ముందుగా రంజి ట్రోఫీ మ్యాచ్లలో  ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని బిసిసిఐ రవీంద్ర జడేజాకు ఆదేశాలు జారీ చేసిందట.  చెన్నైలో జరిగే రంజి మ్యాచ్ లో ఆడేందుకు రవీంద్ర జడేజా సిద్ధమయ్యాడు. సౌరాష్ట్ర  తరఫున బరిలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే బౌలింగ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నాడట ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: