వరల్డ్ కప్ మ్యాచ్ టైమింగ్స్ పై.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు?

praveen
2023 ఏడాదిలో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి అటు బీసీసీఐ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పాలి. అయితే వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రస్తుతం ఏ జట్టు ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వరల్డ్ కప్ ప్రారంభానికి ఎన్నో రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ఎంతోమంది ఇక వరల్డ్ కప్ లో ఏ జట్టు ఎలా రాణిస్తుంది అన్న విషయంపై తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉండడం గమనార్హం.

 ఇక తరచూ ఇలాంటి రివ్యూలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేవలం మాజీ ఆటగాళ్లు క్రికెట్ నిపుణులు మాత్రమే కాదు అటు ప్రస్తుతం ఆయా జట్ల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు సైతం  భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ గురించి స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోని ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియాలో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్న సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 మరి కొన్ని నెలల్లో భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ల టైమింగ్స్ గురించి అశ్విన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.  మ్యాచులు ఉదయం 11:30 గంటలకే ప్రారంభం అయితే బాగుంటుంది అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలా చేయడం వల్ల పిచ్ పై తేమ ఏర్పడటం తగ్గి బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్. ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ ప్రకారం వన్డే మ్యాచ్లను ఒకటిన్నర గంటలకు నిర్వహిస్తే ఇక పిచ్ పై తేమ పేరుకుపోయి... అప్పుడు పిచ్ ఎంతో నెమ్మదిస్తుంది అంటూ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: