ఏం చేస్తాం.. నాకు రాసిపెట్టి లేదు : సిరాజ్

praveen
ఇటీవల కాలంలో భారత జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకున్న హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. తన స్పీడ్ బౌలింగ్ తో అటు ప్రత్యర్థులు అందరికీ కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఏకంగా ప్రతి మ్యాచ్లో కూడా వరుసగా వికెట్లు పడగొడుతూ టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి. మొన్నటికి మొన్న శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో అదరగొట్టిన మహమ్మద్ సిరాజ్ ఇక ఇటీవల వన్డే సిరీస్ లో కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

 ముఖ్యంగా ఇటీవల జరిగిన నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ప్రత్యర్థి శ్రీలంక ఓటమిని సిరాజ్ శాసించాడు చెప్పాలి. అతడు వేసిన ప్రతి ఓవర్లో ఒక వికెట్ పడగొడుతూ అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొత్తంగా నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. ఇక మూడో వన్డే మ్యాచ్లో అటు భారత జట్టు భారీగా పరుగులు తేడాతో విజయం సాధించింది అంటే అందులో సిరాజ్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే 32 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడం గురించి మ్యాచ్ అనంతరం మాట్లాడిన సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే నాలుగు వికెట్లు తీసిన సిరాజ్ తృటిలో తన పాంచ్ పటాకా కొట్టే ఛాన్సన్ మిస్ అయ్యాడు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీయాలని ఎంతగానో ట్రై చేశాను అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు. కానీ కుదరలేదు.. నా చేత ఐదు వికెట్లు తీయించాలని  రోహిత్ కూడా ట్రై చేశాడు. కానీ ఏం చేస్తాం నాకు నాలుగు వికెట్లే రాసిపెట్టి ఉన్నట్టుంది అంటూ మొహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: