కోహ్లీ, రోహిత్ ల.. టి20 కెరియర్ ముగిసినట్లేనా?

praveen
గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీలో తప్పకుండా విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు.  15 ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ  అటు టీమ్ ఇండియా వరల్డ్ కప్ను ముద్దాడుతుందని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ లీగ్ దశలో అదరగొట్టిన రోహిత్ సేన అటు సెమీఫైనల్ లో మాత్రం పేలవ పరదర్శనతో నిరాశపరిచింది. ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో  ఘోర పరాజయాన్ని చవిచూసి ఇంటి బాట  పట్టింది.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. ముఖ్యంగా జట్టులో సీనియర్లు ఉండడం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉందని.. ఇక సీనియర్లు అందరిని కూడా పక్కనపెట్టి  యువ ఆటగాళ్ళతో కొత్త జట్టును  తయారు చేయాలి అంటూ డిమాండ్లు కూడా తెర మీదికి వచ్చాయ్. ఈ క్రమంలోనె బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్ని ఆ దిశగా  అడుగులు వేస్తున్నారు అన్న ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇది నిజమే అన్నది అర్థమవుతుంది. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్లుగా కొనసాగుతూ అత్యుత్తమ ఆటగాళ్లుగా ఉన్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకు టి20 జట్టు నుంచి పక్కన పెట్టేసారు అనేది తెలుస్తుంది.

 బిసిసిఐ టీమ్ ఇండియాలో ప్రక్షాళన చేపట్టింది అన్నదానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన టి20 సిరీస్లో రోహిత్ శర్మను విరాట్ కోహ్లీని ఎంపిక చేయలేదు బీసీసీఐ. ఇక గత ఏడాది చివర్లో జరిగిన ఈ సిరీస్ లో హార్దిక్ కెప్టెన్గా వ్యవహరించాడు. శ్రీలంకతో టి20 సిరీస్ లో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ కూడా వీరిద్దరిని పక్కన పెట్టడం గమనార్హం. దీంతో ఇక విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలను టి20 నుంచి బీసీసీఐ పూర్తిగా తప్పించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇద్దరు స్టార్ క్రికెటర్ల టి20 కెరియర్ ముగిసినట్లే అని ఎంతో మంది చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: