సూర్య కుమార్ ముందు.. కొత్త సవాల్.. ఏం చేస్తాడో?

praveen
2023 ఏడాదిలో వరుసగా సిరీస్ లకు సిద్ధమవుతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్  ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ అటు టీమ్ ఇండియాకు ఎంతో కీలకం కానుంది అని చెప్పాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాని తప్పకుండా సొంతగడ్డపై ఓడించాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకోసం అన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటుంది టీమిండియా జట్టు.

 ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా తో భారత్ వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటన చేశారు. ఈ క్రమంలోనె అందరూ ఊహించినట్లుగానే మొన్నటి వరకు టెస్ట్ సిరీస్ లో భాగమైన ఆటగాళ్లు ఇక ఇప్పుడు కూడా కనిపించారు. కానీ గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన సూర్య కుమార్ యాదవ్ కూడా భారత జట్టు తరఫున మొదటిసారి టెస్ట్ ఫార్మాట్ లోకి అరంగేట్రం చేయబోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్లో ఇక సూర్యకుమార్ను కూడా జట్టులో ఎంపిక చేశారు సెలెక్టర్లు.

 అయితే ఇప్పటికే టీ20 లో విధ్వంసం కొనసాగించి ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డే ఫార్మాట్లో కూడా తానేంటో నిరూపించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక ఇప్పుడు టీమిండియా తరఫున టెస్టుల్లో నిరూపించుకోవలసి ఉంది. అయితే దూకుడైన ఆట తీరకు కేరాఫ్ అడ్రస్ అయిన సూర్య కుమార్ యాదవ్ ఇక సుదీర్ఘమైన ఫార్మాట్ గా పేరు ఉన్న టెస్ట్  ఫార్మాట్లో ఎలా రానిస్తాడు అన్నది ఆసక్తికరంగా అయితే. ఇక భారత్ తరపున టెస్ట్ అరంగేట్రం అటు సూర్య కుమార్ కి కొత్త సవాల్ లాంటిది అని చెప్పాలి. కాగా ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సూర్యకి మంచి రికార్డు ఉంది. 79 మ్యాచ్లలో 5549 పరుగులు చేయగా.. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: