వన్డే క్రికెట్ చరిత్రలో.. శ్రీలంక అత్యంత చెత్త రికార్డు?

praveen
ఇటీవలే భారత్ శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే మొదటి మ్యాచ్ లో ఓడిపోయి నిరాశలో ఉన్న శ్రీలంక జట్టు ఇక రెండవ వన్డే మ్యాచ్లో మాత్రం గెలిచి సిరిస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో నాలుగు వికెట్లు తేడాతో శ్రీలంక జట్టు ఓటమిపాలు అయింది అన్న విషయం తెలిసిందే. విజయం కోసం చివరి వరకు పోరాడినప్పటికీ విజయం దక్కలేదు అని చెప్పాలి. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే చివరికి సిరీస్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే ఇక ఇటీవల టీం ఇండియా చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన శ్రీలంక  జట్టు వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది అని చెప్పాలి. అదేంటి రెండో వన్డే మ్యాచ్లో శ్రీలంక మరి అంత దారుణమైన ప్రదర్శన ఏమి చేయలేదు. అద్భుతంగా రానించి ఏకంగా టీమ్ ఇండియా ను ఓడించినంత పని చేసింది. ఇక చెత్త రికార్డు ఎందుకు అని అనుకుంటున్నారు కదా. అయితే ఒక పరాజయం విషయంలో కాదు ఇప్పుడు వరకు వన్డే క్రికెట్ చరిత్రలో శ్రీలంక అన్ని మ్యాచ్లను పరిగణలోకి తీసుకుంటే ఇక చెత్త రికార్డు శ్రీలంక ఖాతాలో చేరిపోయింది.

 ఇప్పుడు వరకు వన్డే ఫార్మాట్లో శ్రీలంక జట్టు 880 మ్యాచ్లు ఆడింది. ఇక ఇందులో 437 వన్డే మ్యాచ్ లలో ఓటమి పాలు అయింది అని చెప్పాలి.  తద్వారా అత్యధిక మ్యాచ్ లలో ఓటమిపాలు అయిన జట్టుగా చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇక మొన్నటి వరకు ఈ చెత్త రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 436 వన్ డే మ్యాచ్ లలో ఓడింది ఇండియా. కానీ ఇటీవలే రెండు మ్యాచ్లలో వరుసగా ఓడిపోవాలని శ్రీలంక ఈ చెత్త రికార్డును బ్రేక్ చేసింది. మూడో స్థానంలో 419 ఓటములతో  పాకిస్తాన్ ఉంది అని చెప్పాలి. అదే సమయంలో రెండో వన్డే మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఓకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాతో సంయుక్తంగా 95 విజయాలతో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: