షాకింగ్ వీడియో : పాక్ జెర్సీని నేలకేసి కొట్టిన అంపైర్?

praveen
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆతిథ్య  పాకిస్తాన్ జట్టుతో వరుసగా సిరీస్ లు ఆడుతుంది న్యూజిలాండ్. ఈ క్రమంలోనే ఇటీవల రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్లు కూడా డ్రాగా ముగిసాయ్. ఇక ఇప్పుడు పాకిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడుతూ ఉంది. అయితే అటు మొదటి వన్డే లో పాకిస్తాన్  న్యూజిలాండ్ పై విజయా డంక మోగించి శుభారంభం చేసింది అని చెప్పాలి. అయితే రెండో వన్డే మ్యాచ్లో మాత్రం న్యూజిలాండ్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది.

 ఒకవైపు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు వీరవిహారం చేస్తూ పరుగుల వరద పారిస్తే.. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఇక ప్రత్యర్ధుల  వికెట్లు పడగొట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల  పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య కరాచి వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 79 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది న్యూజిలాండ్ జట్టు. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1 తో సమంగా కొనసాగుతుంది అని చెప్పాలి.  తద్వారా ఇక మూడవ వన్డే మ్యాచ్ డిసైడర్ మ్యాచ్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇదిలా ఉంటే ఇలా పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఒక ఊహించని పరిణామం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 39 ఓవర్లో ఏకంగా ఫీల్డ్ ఎంపైర్ గా కొనసాగుతున్న వ్యక్తి తన చేతిలో ఉన్న పాకిస్తాన్ జెర్సీని నేలకేసి కొట్టడం అందరిని షాక్ కి గురి చేసింది. 39వ ఓవర్ లో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ వసీం జూనియర్ వికెట్లను గురిపెట్టి త్రో విసిరాడు.  కానీ అది ఫీల్డ్ అంపైర్ గా ఉన్న అలిందార్ కాలికి బలంగా తాకింది. దీంతో అతని కోపం నషాలానికి అంటింది. దీంతో చేతిలో ఉన్న పాక్ బౌలర్ హరీష్ రావుఫ్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఇక తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు అంపైర్ కాలనీ రుద్దుతూ సేవలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: