రెండో వన్డే మ్యాచ్.. సూర్య, ఇషాన్ జట్టులోకి.. వేటు ఎవరిపై అంటే?

praveen
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా శుభారంభం  చేసింది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించి అదరగొట్టింది టీమిండియా. ఏకంగా 67 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. కాగా నేడు ఎంతో కీలకమైన రెండో మ్యాచ్ ఆడ బోతుంది.  ఇక ఈ రెండో మ్యాచ్లో భాగంగా టీమ్ ఇండియా జట్టు ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఎందుకంటే ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచి జోరు మీద ఉన్న టీమ్ ఇండియా ఇక రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించింది అంటే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకున్నట్లు అవుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన శ్రీలంక జట్టు ఇక వన్డే సిరీస్ లో భాగంగా ఘన విజయాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా గత కొంతకాలం నుంచి టీమిండియా తుది జట్టులో మార్పులు చేర్పులు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. దీంతో రెండో వన్డే మ్యాచ్లో ఎలాంటి మార్పులు చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 అయితే గత మ్యాచ్ ప్రదర్శన ఆధారంగా చూసుకుంటే మాత్రం ఇక ఎవరిని తప్పించే అవకాశం లేదు అని చెప్పాలి. కానీ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లో ఉండడం. ఇక ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ తో చివరి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన నేపథ్యంలో వారిని రొటేషన్ పరిధిలో జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరికీ అవకాశం కల్పిస్తే ఎవరిపై వేటు వేయబోతున్నారన్నది  కూడా ఆసక్తికరంగా మారింది. అయితే గత మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ దాటిగానే బ్యాటింగ్ చేసినప్పటికీ భారీ స్కోర్లుగా మార్చడంలో విఫలమయ్యారు అని చెప్పాలి. శ్రేయస్ 28, రాహుల్ 39 పరుగులు చేసి ఔట్ అయ్యారు. దీంతో ఇక సూర్యకుమార్ కిషన్ కిషన్లకు చోటు ఇవ్వాలంటే వీరిద్దరిపై వేటు వేయక తప్పదు అన్న అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: