టీమిండియాకు.. అతను ఒక విలువైన ఆస్తి : గంగూలీ

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద ఎంత తీవ్రంగా వేధిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సమయంలోనే కీలకమైన ఆటగాళ్లు టీమిండియాకు దూరమవుతున్న నేపథ్యంలో ఇక టీమిండియా వ్యూహాలు మొత్తం తారుమారు అవుతున్నాయి. గత ఏడాది జరిగిన ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇక గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడం అటు టీమ్ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా వెన్నునొప్పి గాయం కారణంగా కీలకమైన టోర్నీలకు దూరమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇక ఇటీవల శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ లో మళ్ళీ జట్టులోకి పునరాగమనం చేస్తాడు అని అందరూ భావించారు.

 క్రమంలోనే బుమ్రా పునరాగమనం గురించి అటు అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూశారు అని చెప్పాలి. కానీ చివరికి అందరికీ నిరాశే ఎదురయింది. ఎందుకంటే వెన్నునొప్పి  గాయంకి సర్జరీ చేసుకున్న జస్ప్రీత్ బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అయితే అతను పూర్తిగా కోలుకున్నాడు అనుకుంటున్న సమయంలో మళ్ళీ వెన్నునొప్పి వేధించడం మొదలుపెట్టింది. తద్వారా ఇక అతని శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.

 అయితే గాయం కారణంగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు దూరం కావడంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలో కూడా భారత జట్టుకు చాలా ముఖ్యమైన ఆస్తి అంటూ సౌరవ్ గంగూలీ  చెప్పుకొచ్చాడు.. అతడు లేకపోవడం వల్ల జట్టులో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా గాయపడుతూ ఉంటారు అంటూ  తెలిపాడు. ఇక అతను కోలుకునేంతవరకు బీసీసీఐ ఓపికగా వేచి చూడాలి అంటూ చెప్పాడు. ఫాస్ట్ బౌలింగ్ చేయడం ఇక జట్టులో ఎక్కువ కాలం కొనసాగడం.. అంత సులభమైన విషయం కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: