సూర్య సంచలనం.. భారత క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడు?

praveen
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ గత కొంతకాలం నుంచి ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటూ ఉన్నాడు అనిచెప్పడంలో అతిశయోక్తి లేదు. తన 360 డిగ్రీస్ బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ చూపును కూడా తనువైపుకు తిప్పుకుంటున్నాడు సూర్య కుమార్ యాదవ్. అంతేకాదు ఇక ఒక్క ఏడాది సమయంలోనే ఏకంగా ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

 ఏదో అదృష్టవశాత్తు సూర్య కుమార్ కు ఐసీసీ నెంబర్వన్ ర్యాంకు వచ్చింది అని విమర్శలు చేసిన వారి నోర్లు మూయిస్తూ ఇక తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతూ ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇలా ఇప్పటికే తన ఇన్నింగ్స్ లతో ఎన్నో రికార్డులు కొల్లగోడుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇక ఇప్పుడు భారత క్రికెట్ హిస్టరీ లో ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.

 మొన్నటి వరకు ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగిన సూర్య కుమార్ యాదవ్ ఇక ఇటీవల ఏకంగా 908 పాయింట్లు సాధించాడు అని చెప్పాలి. తద్వారా ఒక అరుదైన రికార్డు అతని ఖాతాలో చేరిపోయింది. టి20 క్రికెట్లో 900 రేటింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా సూర్య కుమార్ నిలిచాడు అని చెప్పాలి. ఇక తర్వాత స్థానంలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 631 పాయింట్లతో విరాట్ కోహ్లీ 13వ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: