కోహ్లీ, ధోనిలను వెనక్కి నెట్టిన పాక్ బ్యాట్స్మెన్.. ఆసియాలోనే తొలి ప్లేయర్?

praveen
ఆసియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్లలో మహేంద్రసింగ్ ధోని ఒకడిగా కొనసాగుతూ ఉంటాడు.. ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ధోనీ తర్వాత ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్ కు రికార్డుల రారాజుగా కొనసాగుతూ ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఆట తీరుతో ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. నేటి జనరేషన్ క్రికెటర్లలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడం సాధారణ క్రికెటర్లకు సాధ్యం కాని పని అని చెప్పాలి. అయితే ఇటీవల ఏకంగా విరాట్ కోహ్లీ మహేంద్రసింగ్ ధోనీలను వెనక్కి నెట్టి ఇక ఆసియాలోనే ఏకైక క్రికెటర్ గా ఒక అరుదైన ఘనత సాధించాడు స్టార్ క్రికెటర్. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం. ఇటీవల కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్ అజాం ఏకంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలను వెనక్కి నేట్టాడు అని చెప్పాలి.

 ఇక ఇటీవల జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా 82 బంతులు ఎదుర్కొన్న బాబర్ అజం 66 పరుగులు చేశాడు. ఇక అతని అర్థ సెంచరీలో ఐదు ఫోర్లు ఒక సిక్సర్ ఉండడం గవనార్హం. అయితే రికార్డులు పరిశీలిస్తే వ్యక్తిగత బ్యాటింగ్ సగటు విషయంలో విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీలను వెనక్కి నెట్టి ఆసియా బ్యాట్స్మెన్లలో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు బాబర్ అజాం అని చెప్పాలి. కనీసం 20 వన్డే ఇన్నింగ్స్ లలో బాబర్ అజం బ్యాటింగ్ సగటు అందరికంటే అత్యధికంగా ఉండడం గమనార్హం.

 20 వన్డే ఇన్నింగ్స్ లలో బాబర్  సగటు 59.87 గా ఉంది. కాగా ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 57.47 సగటుతో ఉండగా.. ఇమామ్ ఉల్హక్ 51.81 సగటు.. మహేంద్ర సింగ్ ధోని 50.57 సగటుతో తర్వాత స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇలా 20 వన్డేలలో అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్మెన్ గా ఇక ఆసియా క్రికెటర్లలో బాబర్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతున్న బాబర్ అజం అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో కూడా 226 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: