ఏంటి ఓడినా పర్లేదా.. ప్రతి కెప్టెన్ ఇలా ఎందుకు చేస్తున్నాడో?

praveen
ఇటీవల కాలంలో టీమిండియా  ప్రయోగాలకు అడ్డాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లను మారుస్తూ అటు సెలెక్టరు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా జట్టు సారదులుగా ఉన్న వారు చేస్తున్న ప్రయోగాలు ఇక జట్టుకు మంచి చేస్తూ ఉంటే.. మరికొన్నిసార్లు మాత్రం మొదటికే మోసం చేస్తూ చివరికి ప్రత్యర్ధుల చేతుల్లో ఘోరంగా ఓడిపోయే పరిస్థితిని తీసుకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతోంది.

ఈ టి20 సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ లో విషయం సాధించి మరో మ్యాచ్ లో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక నేడు మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. అయితే రెండో టి20 మ్యాచ్ లో భాగంగా డెత్ ఓవర్లలో అక్షర్ పటేల్తో బౌలింగ్ వేయించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే మ్యాచ్ అనంతరం దీనికి కారణం చెప్పుకొచ్చాడు హార్దిక్. మ్యాచ్ ఓడిపోయిన పర్వాలేదు కానీ ఏకంగా యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమిస్తారు అన్న కారణంతోనే అక్షర పటేల్తో బౌలింగ్ వేయించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన మాజీ ఆటగాడు అజయ్ జడేజా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా పాత విధానాన్ని పూర్తిగా మార్చాలని భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇంతకుముందు ఉన్న వాళ్ల కెప్టెన్సీ సరిగ్గా లేదా ఏంటి అంటూ ప్రశ్నించాడు. ధోని నుంచి కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి టీమిండియాలో ఇలాంటి సాంప్రదాయం కొనసాగుతుంది. కోహ్లీ నుంచి రోహిత్ కెప్టెన్సీ అందుకున్న తర్వాత కూడా ఇక ఇలాంటి ప్రయోగాలు చేసి సమూలమైన మార్పులకు తెర లేపాడు. ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా ఇదే చేస్తున్నాడు అంటూ అజయ్ జడేజా వ్యాఖ్యానించాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ దీనిపై స్పందిస్తూ.. గత కెప్టెన్ల నేతృత్వంలో ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియా విఫలమైంది. అందుకే కొత్త విధానాలను అమలు చేయాలని భావిస్తున్నారు అంటూ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: