మహిళల ఐపీఎల్ లో.. చెన్నై సూపర్ కింగ్స్?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి. ఒకప్పుడు భారత కెప్టెన్ గా తిరుగులేని ఆటగాడిగా కొనసాగిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఏకంగా నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ఈ జట్టు ప్రాంతంతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకుంది.

 పూర్తిగా సీనియర్లతో కూడిన ఈ జట్టు డాడీస్ ఆర్మీగా పేరు సంపాదించుకున్నప్పటికీ టైటిల్లు గెలవడంలో మాత్రం అందరికంటే ముందుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో సరికొత్తగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏడాదిలో రెండుసార్లు అలరించబోతుంది అన్నది తెలుస్తుంది. అదేంటి ఐపిఎల్ ఒక్కసారిజరిగితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు సార్లు ఎలా అలరిస్తుంది అనుకుంటున్నారు కదా.

 అయితే ప్రస్తుతం మెన్స్ ఐపీఎల్ లో మాదిరి గానే అటు బీసీసీఐ నిర్వహించ తల పెట్టిన మహిళల ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉండబోతుందట. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేము మహిళల ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాం. చెన్నై సూపర్ కింగ్స్ కి మహిళల జట్టు లేక పోతే బాగుండదు. మేము మహిళల క్రికెట్ ను ప్రోత్సహించాలి అనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో. దీన్ని బట్టి ఇక మహిళల ఐపీఎల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csj

సంబంధిత వార్తలు: