అగ్రస్థానంపై కన్నేసిన చాహల్.. 4 వికెట్స్ తీస్తే?

praveen
టీమ్ ఇండియాలో స్టార్ స్పిన్నర్గా కొనసాగుతున్న చాహల్ గత కొంతకాలం నుంచి మాత్రం సరైన అవకాశాలు అందుకోలేకపోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక టి20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో సైతం భారత సెలక్టర్లు అతని పక్కన పెట్టడంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఇక ఇప్పుడు కొత్త ఏడాదిలో మాత్రం శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో చాహల్ అవకాశాలు దక్కించుకున్నాడు.

 ఈ క్రమంలోనే ఇక ఈ టి20 సిరీస్ లో చాహాలు వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటికే జట్టులో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్న నేపథ్యంలో చాహల్ తనను తాను కొత్తగా నిరూపించుకోకపోతే మాత్రం ఇక తన కెరియర్ పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్ లో మరోసారి చాహల్ తన మునుపటి ఫామ్ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఇప్పుడు శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతున్న చాహాల్ ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి.

 శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్లో ఒకవేళ చాహాల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు అంటే చాలు ఇక టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్ పేట ఉంది అని చెప్పాలి. భారత్ తరపున 87 టీ20 మ్యాచ్ లు ఆడిన భువి 90 వికెట్లు పడగొట్టాడు. అయితే చాహల్ 71 టీ20 మ్యాచ్లలో 87 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్లో భువనేశ్వర్ కుమార్ భాగం కాకపోవడంతో ఇక అతన్ని వెనక్కి నెట్టి అరుదైన రికార్డును బ్రేక్ చేసే అవకాశం చాహల్ కు వచ్చేసింది అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో అశ్విన్ 72, బూమ్రా 70, హార్థిక్ పాండ్యా 62 వికెట్లతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: