ఆస్పత్రి బెడ్ పై నుండి.. ఫోటో షేర్ చేసిన స్టార్ క్రికెటర్?

praveen
గత కొంతకాలం నుంచి ఎంతోమంది స్టార్ క్రికెటర్లు వరుసగా గాయాల బారిన పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే  అయితే ఇలా గాయాల బారిన పడుతూ జట్టుకు చాలా కాలం పాటు దూరమైన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జఫ్రా అర్చర్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి గాయం నుంచి కోలుకొని జట్టులోకి రావడం.. ఇక కొన్నాళ్లకే మళ్లీ గాయం తిరగబెట్టడంతో జట్టుకు దూరం అవడం లాంటివి జరుగుతూ ఉంది.  అయితే దాదాపు కొన్ని నెలల నుంచి జఫ్రా అర్చర్ గాయం బారిన పడి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గత ఏడాది ఐపీఎల్ లో అతని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఆడలేదు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవలే జఫ్రా అర్చర్ వెన్నుముక నొప్పి కారణంగా సర్జరీ జరిగింది అన్న విషయం బయటకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సర్జరీ నుంచి తాను కోలుకుంటున్నాడు అన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో అటు ఇంగ్లాండ్ జట్టుకు అందుబాటులోకి వస్తాడని అంతే కాకుండా ఇక ఏడాది ఐపీఎల్ కూడా ఆడతాడు అని గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు తెరమీదికి వచ్చాయి. అయితే ఇటీవల ఇంగ్లాండు స్టార్ బౌలర్ జఫ్రా అర్చర్ ఆస్పత్రి బెడ్ మీద నుంచి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 అంతేకాకుండా తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని పలు విషయాలను చెప్పుకొచ్చాడు. ఏకంగా తనకు వెనుముక్క సర్జరీ అయిన విషయాన్ని ఫోటోలో చూపించాడు జఫ్రా అర్చర్.  ముక్క నొప్పికి సంబంధించి సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. 2022 కు థాంక్యూ.. 2023లో నేను రెడీ అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించాడు జఫ్రా అర్చర్.  కాగా 2021లో ఆర్చర్ చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు అని చెప్పాలి. అప్పటినుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: