2022.. క్రికెటర్లకు అస్సలు కలిసి రాలేదే?

praveen
ఇటీవల టీమిండియాలో స్టార్ వికెట్ కీపర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. తెల్లవారుజామున ఉత్తరాఖండ్లోని రూర్కే ప్రాంతంలో ఏకంగా రోడ్డుప్రమాదం బారిన పడిన పంత్ తీవ్ర గాయాల పాలయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలతో పాటు శరీరమంతా గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే సరైన సమయంలో ఆసుపత్రికి తరలించడం కారణంగానే రిషబ్ పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడలిగాడు అని వైద్యులు తెలిపారు.

 పంత్ కు తీవ్ర గాయాలు అయిన నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. తమ అభిమాన క్రికెటర్ త్వరగా కోలుకోవాలని అంటూ పూజలు కూడా చేస్తూ ఉండడం గమనార్హం. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సహచరులు కూడా అతను త్వరగా కోవాలని కోరుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం పారిన పడిన నేపథ్యంలో  ఈ ఏడాది అసలు క్రికెటర్లకే ఎక్కడ కలిసి రాలేదు అన్న విషయం మాత్రం తెరమీదకి వచ్చింది.

 ఎందుకంటే ఈ ఏడాది ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది మాజీ క్రికెటర్లను వెంటాడాయి అనేది తెలుస్తుంది. ఆ వివరాలు చూసుకుంటే.. మే 14వ తేదీన ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ అయిన ఆండ్రూ సైమన్స్ కారు ప్రమాదం బారిన పడి చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి మరవకముందే ఆగస్టు 9వ తేదీన సౌత్ ఆఫ్రికా కు చెందిన అంపైర్ రూఢీకొర్జన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇక డిసెంబర్ 14వ తేదీన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ప్రింటాఫ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇక ఇప్పుడు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి ఆసుపత్రిపాలయ్యాడు. ఇలా ఈ ఏడాది క్రికెటర్లకు అస్సలు కలిసి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: