పోతే పోయింది.. మనకు మంచే జరిగిందిగా?

praveen
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు అటు ఆస్ట్రేలియా పర్యటనకు రాగా.. ఇక మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూడు మ్యాచ్లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి. ఇక ఈ మ్యాచ్లలో అటు ఆతిధ్య ఆస్ట్రేలియ జట్టు స్వదేశి పరిస్థితులను వినియోగించుకొని ఎప్పటిలాగానే ప్రత్యర్థి పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

 ఈ క్రమంలోనే అటు సౌత్ ఆఫ్రికా జట్టు ఓటమితో నిరాశలో మునిగిపోయింది అని చెప్పాలి. ఇటీవల జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో 152 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. అయితే ఇక ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించే విషయంలో అటు ఆస్ట్రేలియా జట్టు తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది అని చెప్పాలి. అయితే దాదాపు ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో స్థానం ఖరారు అయినట్లే అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం 78.57 పర్సంటేజీ పాయింట్లతో  కొనసాగుతుంది ఆస్ట్రేలియా. అదే సమయంలో అటు సౌత్ ఆఫ్రికా మాత్రం ఓటమి కారణంగా ఇక ఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది అని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 50 పర్సంటేజీ పాయింట్తో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

 ఈ సమయంలో శ్రీలంక జట్టు 53.3 పర్సంటేజీ పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా 58.93 మా ఇంట్లో అటు టీమిండియా రెండవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల సౌతాఫ్రికా ఓడిపోవడంతో టీమ్ ఇండియాకు ఫైనల్ చేరే అవకాశాలు మరింత మెరుగు అయ్యాయి. ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మూడు మ్యాచ్లు గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఇలా సౌత్ ఆఫ్రికా పోతూ పోతూ భారత్కు మేలు చేసింది అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: