వారెవ్వా.. కేన్ మామ డబుల్ సెంచరీ.. ఖాతాలో ఎన్నో రికార్డులు?

praveen
సుదీర్ఘమైన ఫార్మాట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో గత కొంతకాలం నుంచి ఎంతోమంది స్టార్ ప్లేయర్లు సెంచరీలతో చెలరేగిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్లు వేరైనప్పటికీ అటు తమ అభిమాన స్టార్ ప్లేయర్లు సెంచరీలతో చెలరేగిపోతున్న తీరు అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరిని కూడా ఆనందంలో ముంచేస్తుంది. ఇలా సెంచరీలు డబుల్ సెంచరీలు చేస్తూ ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నారు ఆటగాళ్లు. ఇకపోతే ఇటీవల పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్ట్ లో భాగంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఏకంగా సెంచరీస్ చేసి చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే కేన్ విలియంసన్ సాధించిన సెంచరీకి సంబంధించిన చర్చ ముగిసేలోపే మరోసారి తన బ్యాటింగ్ తో ఆశ్చర్యపరిచాడు కేన్ విలియంసన్. ఈసారి సెంచరీ చేయడం కాదు ఏకంగా డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. మూడో రోజు ఆటలో భాగంగా ఇటీవల డబుల్ సెంచరీ తో ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టాడు కేన్ మామ. కాగా కేన్ విలియమ్సన్ కు ఇది టెస్ట్ ఫార్మాట్లో ఐదవ డబల్ సెంచరీ కావడం గమనార్హం   దీంతో న్యూజిలాండ్ జట్టు తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్గా కేన్ విలియంసన్ చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి.

 ఇంతకుముందు మాజీ క్రికెటర్ బ్రాండన్ మేకల్లమ్ నాలుగు డబుల్ సెంచరీలతో ఇక ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ప్లేయర్గా కొనసాగుగా.. ఇక ఇప్పుడు కెన్ విలియంసన్ ఆ రికార్డును బద్దలు కొట్టేశాడు. అంతేకాదు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో టెస్టుల్లో ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ప్రేయర్ గా విరాట్ కోహ్లీ తర్వాత రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా పాకిస్తాన్ పై టెస్టులలో ఒకే మ్యాచ్లో ఓకే ఇన్నింగ్స్ లో సెంచరీ, డబుల్ సెంచరీ మార్కును అందుకున్న మొదటి క్రికెటర్ గా కూడా అటు కేన్ విలియంసన్ అరుదైన రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. అయితే 2021 జనవరిలో పాకిస్థాన్ లోనే ఆఖరి సారి సెంచరీ, డబుల్ సెంచరీ నమోదు చేశాడు విలియంసన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: