నా తండ్రి ఆ మాట చెబితే.. నమ్మలేకపోయా : సూర్య కుమార్

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో అత్యుత్తమ ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శన  ఏ రేంజ్ లో ఉందో ఒక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రోజుల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్ తన తిరుగులేని ప్రదర్శనతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. మైదానానికి అన్ని వైపుల  ఎంతో అలవోకుగా షాట్లు ఆడుతూ  పరుగులు రాబట్టే సూర్య కుమార్ యాదవ్ నయా 360 ప్లేయర్ గా మారిపోయాడు అని చెప్పాలి  తన ఆటతీరుతో కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులను మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరి చూపును కూడా తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక నాలుగవ స్థానంలో నమ్మదగిన బ్యాట్స్మెన్ గా మారిపోయిన సూర్య కుమార్ యాదవ్కు ఇక ఇటీవలే భారత జట్టులో ప్రమోషన్ వచ్చింది అన్న విషయం తెలిసిందే. జట్టులో ఎంతోమంది సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ కూడా అందరిని పక్కనపెట్టి అటు సూర్య కుమార్ యాదవ్ కు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తూ భారత్ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది  జనవరి మూడవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 సిరీస్ లో భాగంగా అటు హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించగా కీలక బ్యాట్స్మెన్ సూర్య  కుమార్ యాదవ్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ.

 ఇక ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో సిరీస్ కు భారత టి20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపిక కావడంపై స్పందిస్తూ.. ఇదంతా కలలా ఉంది అంటూ పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్ గా ఎంపికైన విషయాన్ని తన తండ్రి మెసేజ్ చేశాడని ఆ మెసేజ్ చూసి నమ్మలేకపోయాను అంటూ సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది తన ఆట తీరుకు లభించిన రివార్డుగా వైస్ కెప్టెన్సీ ని భావిస్తున్నాను అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: