ఐపీఎల్ 2023: SRH లో డేంజరస్ ప్లేయర్... టైటిల్ ఆశలు పెట్టుకోవచ్చా ?

VAMSI
ఐపీఎల్ 16 వ సీజన్ కు సంబంధించిన మినీ వేలం రీసెంటుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో పాల్గొంటున్న మొత్తం 10 ఫ్రాంచైజీలు ఈ మినీ వేలాన్ని బాగానే ఉపయోగించుకున్నాయి అని చెప్పుకోవాలి. ఇక ఈ మినివేలం తర్వాత దాదాపుగా అన్ని జట్లు సమతూకంతో ఉన్నాయి అంటూ క్రికెట్ పండితులు చెబుతున్నారు. కానీ అందరూ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఒకటే... ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ జట్టులో చిచ్చర పిడుగులా.. ఏ ఫార్మాట్ అని పట్టించుకోకుండా చెలరేగి ఆడుతున్న ఆటగాడు హ్యారి బ్రూక్.
ఇంగ్లాండ్ లోని దేశవాళీ టీ 20 టోర్నీ అయిన టీ 20 బ్లాస్ట్ మరియి హండ్రెడ్ లాంటి టోర్నీల వలన వెలుగులోకి వచ్చిన ఈ యువకెరటం అనూహ్యంగా తన ప్రదర్శనతో ఇంగ్లాండ్ సెలెక్టర్లను మెప్పించి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ లోనూ మూడు సెంచరీలు సాధించి రికార్డ్ సాధించాడు. దానితో ఒక్కసారిగా ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఇతనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్ ఎంతటివాడైనా ధనా ధనా ఇన్నింగ్స్ ఆడడం ఇతని ప్రత్యేకత. అందుకే ఫ్రాంచైజీ కోచ్ లు ఇతనిని దక్కించుకోవడానికి తగిన వ్యూహాలతో ఎదురుచూశారు.
కానీ చివరికి హ్యారి బ్రూక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీగా ప్రైస్ పెట్టి కొనుగోలు చేసింది. ఇతని కనీస ప్రైస్ ఒకటైనా కోటితో వేలం స్టార్ట్ కాగా 13 కోట్ల 25 లక్షల వద్ద వేలం ముగిసింది. ఎస్ ఆర్ హెచ్ యజమాని కావ్య మారన్ ఈ బీడ్ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించి ఇతనిని కొనుగోలు చేసింది. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్ధుడైన బ్రూక్ ను సన్ రైజర్స్ ఏ విధంగా వాడుకుంటుంది అన్న దానిపైనే జట్టు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరి హ్యారి బ్రూక్ రాకతో మరోసారి ఐపీఎల్ టైటిల్ ను పొందగలదా చూద్దాం ?    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: