బౌలర్గా మారిన బాబర్.. ఎన్ని పరుగులు ఇచ్చాడంటే?

praveen
సాధారణంగా స్పిన్నర్లు బౌలర్లు మాత్రమే మ్యాచ్లో బౌలింగ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు సైతం బౌలింగ్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు కాస్త బౌలర్లుగా మారిపోయి తమ బౌలింగ్ తో వికెట్లు పడగొట్టడం చేస్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఇక మ్యాచ్ ఎలాగో గెలుస్తుంది అనుకున్న సమయంలో సరదాగా బౌలింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు బౌలింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు సక్సెస్ అయితే కొన్నిసార్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకొని విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది.

 ఇకపోతే ఇటీవలే ప్రపంచ క్రికెట్లో మేటి బ్యాట్స్మెన్లలో ఒకడిగా కొనసాగుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం సైతం ఇటీవల బౌలర్గా మారిపోయి అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. సాధారణంగా బాబర్ అజాం బ్యాటింగ్లో ఇరగదీస్తాడు అని మాత్రమే ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు తెలుసు. ఓపెనర్గా బలిలోకి దిగి పాకిస్తాన్ కు ఇక మంచి ఆరంభాలు అందిస్తూ ఇక విజయ వైపు నడిపిస్తూ ఉంటాడని మాత్రమే అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో బాబర్ బౌలర్గా అవతారం ఎత్తాడు.

 మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 38 పరుగులు చేసిన టైంలో ఇక బాబర్ అజాం కు ఏమనిపించిందో ఏమో.. చివరికి బంతి చేతికి తీసుకొని బౌలర్గా మారిపోయాడు. ఏకంగా ఓ ఓవర్ స్పిన్ బౌలింగ్ వేశాడు. కుడి చేతివాటంతో ఆఫ్ బ్రేక్ స్పిన్ బౌలింగ్ వేసిన బాబర్ తన ఓవర్లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఇలా బాబర్ బౌలింగ్ వేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలో కూడా టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ వేశాడు. ఇప్పటివరకు 11 ఓవర్లు బౌలింగ్ వేసి రెండు వికెట్లు పడగొట్టాడు  బాబర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: