ధోని జట్టులో గుంటూరు కుర్రాడు.. బంగారం లాంటి ఛాన్స్ కొట్టేసాడుగా?

praveen
బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఒక మంచి వేదికగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకుని ఇక భారత జట్టులో చోటు సంపాదించుకోవడానికి ఒక బంగారు బాటను వేస్తూ ఉంటుంది ఐపీఎల్. ఇలా ఐపీఎల్ కారణంగానే అటు భారత జట్టులోకి వచ్చి స్టార్లుగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేలం ప్రక్రియ జరిగింది. ఇక ఈ మినీ వేళలో మరోసారి ఎంతో మంది యువ ఆటగాళ్లు వివిధ జట్ల తరఫున అవకాశం దక్కించుకున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరు కుర్రాడు టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టులో చోటు సంపాదించుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల జరిగిన మినీ వేలంలో షేక్ రసీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్ కు కొనుగోలు చేసింది. అయితే ఇటీవలే జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రానించిన షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ టాలెంట్ స్కౌట్ల దృష్టిలో పడ్డాడు అన్నది తెలుస్తుంది. 2022 అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న యువభారత  జట్టుకు షేక్ రషీద్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు అని చెప్పాలి.

 ఇలా అండర్ 19 ప్రపంచకప్ ముగిసిన అనంతరం షేక్ రషీద్ అటు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఏకంగా ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ లోనే చోటు సంపాదించుకున్నాడు. కొన్ని కారణాలవల్ల అండర్ 19 ఆటగాళ్లు గత మెగా వేలంలో పాల్గొనలేకపోయారు. కానీ ఐపీఎల్ 2023 మినీ వేలంలో మాత్రం రషీద్ కల నెరవేరింది అని చెప్పాలి. అది కూడా మొదటి ఛాన్స్ లోనే ధోని లాంటి దిగ్గజంతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ధోని కెప్టెన్సీలో ఆడే బంగారం లాంటి అవకాశాన్ని గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: